బెంగళూరు : అవినీతి అధికారులపై లోకాయుక్త మళ్లీ పంజా విసిరింది. బెంగళూరు, మైసూరు, కోలారు, తుమకూరు, యాదగిరి, గుల్బర్గాలలో మంగళవారం వేకువ జామున ఏక కాలంలో అధికారులు దాడులు చేశారు. ఆ అధికారుల ఇళ్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. వారి వద్ద రూ.8.89 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వారి బ్యాంక్ అకౌంట్లు, లాకర్లను సీజ్ చేశారు. వాటిలోని సొమ్ము, పొలాలు, ఇంటి స్థలాల విలువ ఇంకా తేలాల్సి ఉంది. ఏడీజీపీ సత్యనారాయణరావు తెలిపిన వివరాల మేరకు..
= రామకృష్ణయ్య.. మైసూరులో రిమ్యాండ్ హోంలో సీడీపీఓ ఉద్యోగి. ఈయన అక్రమంగా రూ 4.52 కోట్ల ఆస్తులు సంపాదించారు.
= ఉమేష్.. తుమకూరులో టీచర్ శిక్షణ సంస్థలో ఎఫ్‌డీఏ. అక్రమ ఆస్తి రూ. 1.20 కోట్లు
= శివనంజప్ప.. బెంగళూరు నగరంలోని బనశంకరిలో అసిస్టెంట్ తహశీల్దార్. అక్రమ ఆస్తి రూ. 1.19 కోట్లు
= సీతారాం.. బెంగళూరులోని హలసూరులో పట్టణాభివృద్ధిశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీరు. అక్రమ ఆస్తి రూ. 89. 50 లక్షలు
= భీమారావు.. యాదగిరి జిల్లా శహపుర తాలూకా పంచాయతీ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీరు. అక్రమ ఆస్తి రూ. 76.67 లక్షలు
= జగదీష్.. కోలారు నగర సభ కమిషనర్. అక్రమ ఆస్తి రూ. 69.75 లక్షలు
= శివానంద కామత్.. శివమొగ్గలో ఆహార పౌర సరఫరాల శాఖలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్. ఆస్తి రూ. 49.50 లక్షలు
అవినీతిపరులపై లోకాయుక్త పంజా
Published Wed, Aug 27 2014 4:34 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement