= అవినీతిపై కాంగ్రెస్ పెద్దలను నిలదీసిన దేవెగౌడ
= 28 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగానే పోటీ
= డిసెంబర్‌లో అభ్యర్థుల జాబితా
సాక్షి, బెంగళూరు : అక్రమ గనుల తవ్వకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంతోష్‌లాడ్‌ను మంత్రిపదవి నుంచి తొలగించి.... ఇక పార్టీలోని నాయకులంతా సచ్చీలురని కాంగ్రెస్‌నాయకులు భావిస్తుండటం తగదని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అన్నారు. బెంగళూరులోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కనకపుర, మైసూరు, చామరాజనగర తదితర నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికీ భూ కబ్జాలు, గనుల తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఈ తంతంగం వెనకాల ఏ నాయకుడు ఉన్నాడో, ఆయనకు సహకరిస్తున ్న ప్రభుత్వ అధికారుల గురించి ప్రభుత్వానికి తెలియదా అని నిలదీశారు. వారిపై చర్యలు తీసుకునే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. అక్రమ గనుల తవ్వకాలు, రవాణాకు సంబంధించి ప్రస్తుతం ఒక కంపెనీ, తొమ్మిది పోర్టులపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలోని మరిన్ని గనుల తవ్వకాలు, ఖనిజ రవాణా రంగంలో ఉన్న కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. వీటన్నింటిపై వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
‘జేడీఎస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సిద్ధరామయ్య ఇదే కార్యాలయంలో కూర్చొని అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడిన వారిని విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడానికి అధికారాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి వివ రాలన్నీ ఏ.టీ రామస్వామి, బాలసుబ్రమణ్యంలు తమ నివేదికలో ప్రభుత్వానికి అందించారు. అలాంటప్పుడు భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధరామయ్య మీనమేషాలు వేయడం ఎందుకో’ అని ఎద్దేవా చేశారు. చట్టాలు, శాసనాల ద్వారా ప్రజల నమ్మకాలను, భావాలను రద్దు చేయాలనుకోవడం వృథా ప్రయాస అన్నారు.
ఇలాంటి వాటి కోసం సమయాన్ని వృథా చేయకుండా ప్రజలకు పనికొచ్చే వాటిపై దృష్టి సారించాలని సిద్ధరామయ్యకు సూచించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీచేస్తుందని... ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని మీడియా సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు ఏ.కృష్ణప్ప స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 28 పార్లమెంటు స్థానాలలో బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. అభ్యర్థుల వివరాలను డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
జేడీఎస్ పదాధికారుల ఎంపిక...
జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ అధ్యక్షతన నిర్వహించిన సవ ూవేశంలో జేడీఎస్ పదాధికారులను ఎంపిక చేశారు. జేడీఎస్ పార్టీ జాతీయ వ్యవహారాల సమితి అధ్యక్షుడిగా హెచ్.కె.కుమారస్వామి, పార్లమెంట్ మండలి అధ్యక్షుడిగా నీరావ రి, పార్టీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీమ్‌లు ఎంపికయ్యారు. ఇక పార్టీ కార్యాధ్యక్షుడిగా బసవరాజ్.ఎస్.హొరట్టి, ఎన్.చలువరాయ స్వామి, బి.బి.నింగయ్య, శారదా పూర్వనాయక్, ఎం.ఎస్.నారాయణ రావ్, సునీల్ హెగ్డే, ఫిలోమిన్ వినిమోళ్, మహంతేష్‌లు ఎంపికయ్యారు.