బెంగళూరు: హోం మంత్రి జీ. పరమేశ్వర రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న డిమాండ్‌ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. బీజేపీ హయాంలో మహిళలపై దారుణాలు జరగలేదా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సీఎం హోదాలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరిస్తున్నాయి.
ఇంతకి ఏం జరిగిందంటే?
సిలికాన్ సిటీ బెంగళూరు దారుణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. గతవారం ఆరేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. నిన్న(సోమవారం) సాయంత్రం తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళపై ఇద్దరు అగంతకులు హత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ పేరుతో మహిళను తమ వాహనంపై ఎక్కించుకున్నారు. అనంతరం, నిర్మానుష్య ప్రదేశంలో బాధితురాలి వద్ద ఉన్న డబ్బు, నగల్ని దోచుకున్నారు. ఆపై దారుణానికి ఒడిగట్టారు. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని చేస్తున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీ హయాంలో మహిళలపై దారుణాలు జరగలేదా? కేసులు నమోదు కాలేదా? మహిళలకు రక్షణ కల్పించాలి. కానీ సమాజంలో జరిగే చెడు పట్ల మేం కఠినంగా వ్యవహరిస్తాం’ అని అన్నారు.
సామూహిక అత్యాచార కేసులో ట్విస్ట్
బెంగళూరు సామూహిక అత్యాచార కేసులో ట్విస్ట్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు గణేష్, శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు బాధిత మహిళ నుంచి డబ్బులు దోచుకునేందుకు యత్నించారు. కానీ బాధితురాలి వద్ద డబ్బులు లేకపోవడంతో బదులుగా లైంగిక చర్యల్లో పాల్గొనేందుకు మహిళ అంగీకరించినట్లు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు దోపిడీ, లైంగిక వేధింపులకు సంబంధించినది. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం’ అని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment