మంత్రిగారూ... స్పెషల్ స్టేటస్ ఇప్పించండి
శ్రీకాళహస్తి రూరల్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇప్పించాలని కేంద్ర మంత్రి రామ్‌శంకర్ కథేరియాను తిరుపతి పార్లమెంట్ సభ్యుడు వెలగపల్లి వరప్రసాద్‌రావు కోరారు. మండలంలోని ఊరందూరు సమీపంలో ఉన్న ఓ కర్మాగారంలో ఆదివారం యూనిట్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఈ మేరకు ఆయనకు విజ్ఞప్తిచేశారు. రాష్ర్ట మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.