minister bojjala gopalakrishnareddy
-
మంత్రిగారూ... స్పెషల్ స్టేటస్ ఇప్పించండి
శ్రీకాళహస్తి రూరల్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇప్పించాలని కేంద్ర మంత్రి రామ్‌శంకర్ కథేరియాను తిరుపతి పార్లమెంట్ సభ్యుడు వెలగపల్లి వరప్రసాద్‌రావు కోరారు. మండలంలోని ఊరందూరు సమీపంలో ఉన్న ఓ కర్మాగారంలో ఆదివారం యూనిట్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఈ మేరకు ఆయనకు విజ్ఞప్తిచేశారు. రాష్ర్ట మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు. -
టీడీపీ నేతల విజయవాడ బాట
► అధికారులు మా మాట వినడం లేదు ► అభివృద్ధి లేక ప్రజల్లోకి వెళ్లలేకున్నాం ► సీఎంకు నివేదించేందుకు పయనం తిరుపతి తుడా: తెలుగుదేశం పార్టీ జిల్లా ముఖ్యనేతలంతా విజయవాడ బా టపట్టారు. ‘జిల్లాలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాం.. పట్టించుకోకుంటే ఇబ్బందులు తప్పేటట్టు లేదు.. అధికారులు మా మాట వినడం లేదు..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద మొరపెట్టుకునేందుకు గురువారం బ యలుదేరి వెళ్లారు. తుడా కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎంతో చర్చించాల్సిన అంశాలపై మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కలెక్టర్ సిద్థార్థ్‌జైన్, ఎమ్మెల్యేలు సుగుణ, తలారి ఆదిత్య, జిల్లా స్థాయి అధికారులు సమావేశమై తర్జనభర్జన పడ్డారు. జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి చేపట్టిన అభివృద్ధి పనులు, చేపట్టబోయే పనుల గురిం చి ఆరాతీశారు. వారి నుంచి సల హాలు, సూచనలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకుని విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. జిల్లాలో ఒక్క అభివృద్ధి పనీ కావడం లేదు.. జిల్లాలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగడం లేదు. సీఎం వచ్చినప్పుడల్లా అది చేస్తా ఇది చేస్తానని మాటలు చెబుతున్నారు. ఒక్కటీ చేసింది లేదు. ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకుని వెళ్లాలి. నియోజకవర్గాల్లో తిరగలేకున్నాం. కనీసం రేషన్ కార్డు, పెన్షన్ కూడా ఇప్పించలేకున్నాం’ అని మంత్రితో జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు వాపోయినట్లు సమాచారం. ఈ విషయమై సీఎంను నిలదీయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొందరు నేరుగా చెప్పాలని నిర్ణయిస్తే, మరికొందరు రాతపూర్వకంగా అందించేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో పాటు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ కూడా విజయవాడ వెళ్లినట్టు సమాచారం. అధికారులు మా మాట వినడంలేదు.. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ మాట వినడం లేదని ఓ ఎమ్మెల్యే గట్టిగా వాదించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఎస్పీడీసీఎల్ వంటి వాటిల్లోనూ ప్రజల సమస్యలను పరిష్కరించలేని స్థితిలో ఉండటం ఏమిటని మరి కొంత మంది నాయకులు మండిపడ్డారు. ‘మా మాట వినే అధికారులు లేరు. మాకు నచ్చిన అధికారులను వేస్తే వేయండి లేకుంటే మీ ఇష్టం’ అని తేల్చిచెప్పినట్లు సమాచారం. -
మనమంతా భాయీ..భాయీ
► మొన్న ఉద్దేశపూర్వక అవమానం ► సీఎం ఆగ్రహంతో దిద్దుబాటుకు ► మంత్రి బొజ్జల యత్నం కలెక్టర్‌తో ప్రజాప్రతినిధుల మంతనాలు ► కార్యకర్తలను లోనికి అనుమతించని వైనం చిత్తూరు(గిరింపేట): కలెక్టర్ తమకు సహకరించడం లేదంటూ.. వారంతా కత్తిగట్టారు. తమను ఏ మాత్రం లెక్కచేడం లేదంటూ రగిలిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల జెడ్పీసమావేశానికి నిర్ణీత సమయానికే వచ్చిన ప్రజాప్రతినిధులు సమావేశ మందిరంలోనికి రాకుండా .. చైర్పర్సన్ చాంబర్లో తిష్టవేశారు. సమావేశం సమయం మించిపోయి.. వారి కోసం కలెక్టర్ నిరీక్షించేలా చేశారు. తీవ్ర అసహనానికి గురైన కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అక్కడి నుంచి నిష్ర్కమించారు. దీంతో తాము కలెక్టర్‌కు ఝలక్ ఇచ్చామని ప్రజాప్రతినిధులంతా సంబరపడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులకు క్లాస్ తీసుకోవడంతో వారంతా కంగుతిన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక.. మళ్లీ కలెక్టర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. ఇందులో భాగంగా అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ గీర్వాణి, ఎంఎల్ఏ సత్యప్రభ, ఎంపీ శివప్రసాద్ చిత్తూరు న గరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్‌తో రహస్య మంతనాలు జరిపారు. ఈ సమావేశానికి కార్యకర్తలు, నాయకులను అనుమతించలేదు. జెడ్పీ సమావేశంలో జరిగిన సన్నివేశాన్ని మరిచి పోయి అధికారులు, నాయకులు సమన్వంతో పనిచేయాలని మంత్రి నచ్చజెప్పినట్లు తెలిసింది. జేసీ నారాయణభరత గుప్త, ఇతర శాఖల జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. -
జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలి
అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు(రూరల్): జిల్లాలో జల సంరక్షణ పనులను వేగవంతం చేసేలా నాయకులు కృషి చేయాలని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. చిత్తూ రు జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా సా ్థయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రేషన్‌షాపు డీల ర్ల భర్తీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక తరలింపులో అవ కతవకలు చోటు చేసుకోకుండా చూ డాలన్నారు. జీడీనెల్లూరు నేత కుతూహలమ్మపై వెదురుకుప్పం మండల నాయకులు ఫిర్యాదు చేసినట్టు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జెడ్పీ చైర్ పర్సన్ గీర్వాణీ, ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. -
ఏపీ మంత్రి ఎదుట పెప్పర్ స్ప్రేలతో కొట్లాట!
తిరుపతి: మంత్రి ఎదురుగానే అధికార టీడీపీ నేతలు కొట్టుకున్నారు. పెప్పర్ స్ప్రేతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన తిరుపతిలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో జరిగింది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి సాక్షిగా శుక్రవారం ఈ ఘటన జరిగింది. పీలేరు టీడీపీ నేతలు రెండు వర్గాలుగా వీడిపోయి పెప్పర్ స్ప్రేలతో దాడులు చేసుకున్నారు. ఆ తర్వాత పరస్పరం పోలీసు స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. -
కీలక దశకు అలిపిరి ఘటన కేసు విచారణ
- సీఎం, మంత్రి బొజ్జలకు 17లోగా సమన్లు - అదేరోజు హాజరయ్యేలా చూడాలని పోలీసులకు కోర్టు ఆదేశం తిరుపతి లీగల్: సీఎం చంద్రబాబుపై 2003 అక్టోబర్ ఒకటో తేదీన అలిపిరి సమీపంలో క్లెమోర్ మైన్స్‌తో దాడి జరిగిన కేసు విచారణ వేగవంతమైంది. కేసులో రెండవ సాక్షి, ప్రస్తుత ఏలూరు పోలీసు ట్రైనింగ్ కాలేజ్ డీఎస్పీ కె. రాజేశ్వరరెడ్డి బుధవారం కోర్టుకు హాజరయ్యారు. ఇదివరలో జడ్జి జారీచేసిన బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేసుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో సీఎం కాన్వాయ్ పైలట్ ఆఫీసర్‌గా ఉన్న రాజేశ్వరరెడ్డి సంఘటనను కోర్టులో వివరించారు. కాగా, విచారణ షెడ్యూల్ ప్రకారం సాక్షులను హాజరుపరచకపోవడంపై జడ్జి బుధవారం పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో 14వ సాక్షిగా ఉన్న సీఎం చంద్రబాబు, 13వ సాక్షిగా ఉన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సాక్షి సమన్లు ఈ నెల 17వ తేదీలోగా అంద జేసి 17వ తేదీన కోర్టుకు హాజరయ్యేలా చూడాలని జడ్జి ఆదేశించారు. అనంతరం కేసును ఈ నెల 11వతేదీకి వాయిదా వేస్తూ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి సదానందమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
'సొంత నియోజకవర్గంలో మంత్రి అక్రమాలు'
తిరుపతి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రాక్షసపాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, నారాయణ స్వామి, నియోజకవర్గం ఇన్ఛార్జీ బియ్యపు మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ లేని విధంగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే అక్రమాలకు పాల్పడుతున్నారని వీరు ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడతున్నారని.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ నేతలకు తగిన శాస్తి తప్పదని శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తల బరోసయాత్రలో పాల్గొన్న పార్టీ నేతలు అధికార పార్టీ నేతలకు సూచించారు.