► అధికారులు మా మాట వినడం లేదు
► అభివృద్ధి లేక ప్రజల్లోకి వెళ్లలేకున్నాం
► సీఎంకు నివేదించేందుకు పయనం
తిరుపతి తుడా: తెలుగుదేశం పార్టీ జిల్లా ముఖ్యనేతలంతా విజయవాడ బా టపట్టారు. ‘జిల్లాలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాం.. పట్టించుకోకుంటే ఇబ్బందులు తప్పేటట్టు లేదు.. అధికారులు మా మాట వినడం లేదు..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద మొరపెట్టుకునేందుకు గురువారం బ యలుదేరి వెళ్లారు. తుడా కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎంతో చర్చించాల్సిన అంశాలపై మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కలెక్టర్ సిద్థార్థ్‌జైన్, ఎమ్మెల్యేలు సుగుణ, తలారి ఆదిత్య, జిల్లా స్థాయి అధికారులు సమావేశమై తర్జనభర్జన పడ్డారు. జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి చేపట్టిన అభివృద్ధి పనులు, చేపట్టబోయే పనుల గురిం చి ఆరాతీశారు. వారి నుంచి సల హాలు, సూచనలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకుని విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.
జిల్లాలో ఒక్క అభివృద్ధి పనీ కావడం లేదు..
జిల్లాలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగడం లేదు. సీఎం వచ్చినప్పుడల్లా అది చేస్తా ఇది చేస్తానని మాటలు చెబుతున్నారు. ఒక్కటీ చేసింది లేదు. ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకుని వెళ్లాలి. నియోజకవర్గాల్లో తిరగలేకున్నాం. కనీసం రేషన్ కార్డు, పెన్షన్ కూడా ఇప్పించలేకున్నాం’ అని మంత్రితో జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు వాపోయినట్లు సమాచారం. ఈ విషయమై సీఎంను నిలదీయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొందరు నేరుగా చెప్పాలని నిర్ణయిస్తే, మరికొందరు రాతపూర్వకంగా అందించేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో పాటు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ కూడా విజయవాడ వెళ్లినట్టు సమాచారం.
అధికారులు మా మాట వినడంలేదు..
జిల్లా, మండల స్థాయి అధికారులు తమ మాట వినడం లేదని ఓ ఎమ్మెల్యే గట్టిగా వాదించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఎస్‌పీడీసీఎల్ వంటి వాటిల్లోనూ ప్రజల సమస్యలను పరిష్కరించలేని స్థితిలో ఉండటం ఏమిటని మరి కొంత మంది నాయకులు మండిపడ్డారు. ‘మా మాట వినే అధికారులు లేరు. మాకు నచ్చిన అధికారులను వేస్తే వేయండి లేకుంటే మీ ఇష్టం’ అని తేల్చిచెప్పినట్లు సమాచారం.
టీడీపీ నేతల విజయవాడ బాట
Published Fri, May 6 2016 2:39 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement