హోరాహోరీగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో గెలిచేందుకు అనేక అడ్డదారులు తొక్కిన అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ..
-
శునకాలకు పచ్చజెండాలు కట్టి ప్రచారంపై విమర్శలు

కాకినాడ: నంద్యాల ఉప ఎన్నిక అనంతరం ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం హోరీహోరీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడలో చిత్రవిచిత్రమైన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.
కాకినాడ 11వ వార్డులో టీడీపీ పచ్చజెండాలు కట్టుకొని శునకాలు దర్శనమివ్వడం స్థానికుల విస్మయపరిచింది. కుక్కకు టీడీపీ జెండాలు కట్టి 11వ వార్డులో తిప్పిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఫొటోలను షేర్ చేసుకుంటున్న నెటిజన్లు.. కుక్కలకు పార్టీ జెండాలు చుట్టి ప్రచారం చేయడం ఏమిటి? ఇదెక్కడి చోద్యమని విస్తుపోతున్నారు. మూగజీవులను సైతం రాజకీయ ప్రచారాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని నిలదీస్తున్నారు.




