టీ-బిల్లు మాడి మసైపోతుంది | Tea - Bill Maadi masaipotundi | Sakshi
Sakshi News home page

టీ-బిల్లు మాడి మసైపోతుంది

Published Tue, Jan 14 2014 3:04 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

Tea - Bill Maadi masaipotundi

తిరుపతిరూరల్, న్యూస్‌లైన్: ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకువస్తున్న తెలంగాణ బిల్లు మాడిమసై పోతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గం రూరల్ మండలం రామానుజపల్లె కూడలి వద్ద తెలంగాణ బిల్లుకు వ్యతి రేకంగా సోమవారం భోగిమంటల్లో బిల్లు ప్రతులను తగులబెట్టారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఓట్లు సీట్లే లక్ష్యంగా జరుగుతున్న సోని యాగాంధీ కుట్రలో భాగమే రాష్ట్ర విభజన అంశమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ కుట్రదారులకు ఎదురునిలబడి పోరాడుతున్నారన్నారు. టీడీపీ కాంగ్రెస్‌తో కుమ్మక్కై అసెంబ్లీ సాక్షిగా విభజనకు అనుకూలం గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకలిగే ఏకైక నాయకుడు జగనన్నే అని ప్రజ లు విశ్వసిస్తున్నారన్నారు. భోగి సందర్భంగా అందరికీ భోగభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు.

అనంతరం భోగి మంటల్లో తెలంగాణ ప్రతులను వేసి తగుల బెట్టారు. ఈ ప్రాంతం జై సమైక్యాంధ్ర... జై జగన్ నినాదాలతో హోరెత్తింది. వైఎస్‌ఆర్ సీపీ రూరల్ మండలాధ్యక్షుడు ఉపేంద్రారెడ్డి, నాయకులు గోవిందరెడ్డి, సుధాకర్‌రెడ్డి, చొక్కారెడ్డి జగదీశ్వరరెడ్డి  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement