ఎస్‌ఐ రాములుకు కన్నీటి వీడ్కోలు | tearfull send off to sub-inspector ramulu | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ రాములుకు కన్నీటి వీడ్కోలు

Published Mon, Oct 28 2013 12:24 AM | Last Updated on Sun, Sep 2 2018 3:43 PM

tearfull send off to sub-inspector  ramulu

 అనంతగిరి, న్యూస్‌లైన్:

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ రాములు నాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. రాములు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పోలీసులు, అతడి స్నేహితులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ బి.రాజకుమారి రాములు నాయక్ మృతదేహంపై పూలమాల ఉంచి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబీకులకు పోలీస్ శాఖ తరఫున రూ.30వేలు అందజేశారు. రాములు నాయక్ పిల్లలను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ రాములునాయక్‌కు నివాళి అర్పించా రు. ఈ సందర్భంగా పోలీసులు రెండు నిమిషాలు మౌనం పాటించి, గాలిలోకి తుపాకులు పేల్చారు.
 
 అంత్యక్రియలకు హాజరైన వారిలో ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, వికారాబాద్ డీఎస్పీ నర్సింహులు, చేవెళ్ల డీఎస్పీ శిల్పవల్లి, ఎస్‌బీఐ సీఐ మస్తాన్ అలీ, చేవెళ్ల సీఐ గంగాధర్, యంటీఓ నర్సింహులు, వికారాబాద్ సీఐ లచ్చిరాం నాయక్, శంకర్‌పల్లి ఎస్‌ఐ చైతన్యకుమార్, వికారాబాద్ ఎస్‌ఐ హన్య్మానాయక్, ఆయా పీఎస్‌ల ఎస్‌ఐలు, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాఘవన్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు కమాల్ రెడ్డి, అనంత్ రెడ్డి, నర్సింహులు, వెంకట్‌రాంరెడ్డి, శ్రీకాంత్, నవీన్, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement