కేబినెట్ భేటీకి టీ.మంత్రులు డుమ్మా | Telangana manisters boycott cabinet meeting | Sakshi
Sakshi News home page

కేబినెట్ భేటీకి టీ.మంత్రులు డుమ్మా

Published Mon, Feb 10 2014 9:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

Telangana manisters boycott cabinet meeting

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి తెలంగాణ ప్రాంత మంత్రులు గైర్హాజరు అయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా తెలంగాణ మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి ఆదేశించినా తెలంగాణ మంత్రులు మాత్రం ఆ సూచనలను బేఖాతరు చేశారు. అలాగే అసెంబ్లీలోనే ఉండి కూడా హైదరాబాద్ ప్రాంత మంత్రులు కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారు.

 అంతకు ముందు కేబినెట్‌ సమావేశానికి గైర్హాజరు కావాలన్న నిర్ణయంపై - తెలంగాణ ప్రాంత మంత్రుల మధ్య సోమవారం ఉదయం ముమ్మరంగా చర్చలు జరిగాయి. మంత్రి జానారెడ్డి నివాసంలో టీ.మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి  పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, సునీతా లక్ష్మారెడ్డి, రాంరెండ్డి వెంకటరెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి  హాజరయ్యారు. ఈ సమావేశం ఇంకా కొనసాగుతోంది.

మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్హాజరు కావాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నిర్ణయించారు. తిరస్కార తీర్మానం విషయంలో స్పీకర్‌ వైఖరిపై వారు మండిపడుతున్నారు. స్పీకర్‌ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, అందుకనే తాము ఈ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు హాజరు కావడంలేదని వారు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement