నాచహళ్లి (వనపర్తిరూరల్), న్యూస్‌లైన్: విద్యుత్ సరఫరా సక్రమంగా లేదంటూ.. మండల పరిధిలోని నాచహళ్లి 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌పై పెద్దగూడెం, పెద్దగూడెం తండాలకు చెందిన కొందరు దాడి చేశారు. తమ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి నాచహళ్లికి మాత్రమే విద్యుత్ సరఫరా ఇస్తారా అంటూ కోపోద్రిక్తులయ్యారు. కార్యాలయంలో ఫర్నిచర్, కిటికీల అద్దాలు పగులగొట్టారు.
అక్కడే ఉన్న సబ్‌స్టేషన్ ఆపరేటర్ దాడిపై చేయటానికి యత్నిం చారు. విషయం తెలుసుకున్న నాచహళ్లి గ్రామస్తులు సబ్‌స్టేషన్ వద్దకువెళ్లి వారాని నివారించే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామస్తులు శివకుమార్, బాలకృష్ణ, చిన్నకుర్మన్న, స్వామిలకు గాయాలయ్యాయి. బాధితులు వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తమపైనకూడా దాడి చేశారని పెద్దగూడెం తండాకు చెందిన గిరిజనులు.. గిరిజన సంఘాలతో కలిసి నాచహళ్లి గ్రా మస్తులపై పోలీసుల కు ఫిర్యాదు చేశారు.
సబ్‌స్టేషన్‌పై దాడి..ఫర్నిచర్ ధ్వంసం
Published Fri, Dec 20 2013 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement