ప్యాపిలికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. స్థానిక చిల్లాకట్ట వీధికి చెందిన కమలాదేవికి మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టి చనిపోయింది. రెండోసారి గర్భం దాల్చగా ఆదివారం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సాధారణ కాన్పులోనే ఈమె ముగ్గురు ఆడపిల్లలను ప్రసవించింది.
ముగ్గురూ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు కలగడంతో వ్యవసాయంపైనే ఆధారపడిన భర్త పుల్లన్న ఆనందంలో మునిగిపోయారు.
ఒకే కాన్పులో ముగ్గురు
Published Mon, Apr 28 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement