‘నగదు బదిలీ’ ప్రారంభం | the beginning of the cash transfe | Sakshi
Sakshi News home page

‘నగదు బదిలీ’ ప్రారంభం

Published Mon, Sep 2 2013 2:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

the beginning of the cash transfe

కలెక్టరేట్, న్యూస్‌లైన్ :కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్య పథకాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మంత్రి సారయ్య మాట్లాడుతూ సామాన్యులకు సంక్షేమ పథకాల ఫలాలు చేరువ చేసేందుకే ప్రభుత్వం నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టిందన్నారు. నగదు బదిలీ పథకం రెండో విడతలో ఆధార్ అనుసంధానంలో ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం గర్వించదగ్గ విషయమన్నా రు. 
 
 పజలంతా ఆధార్ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పారు. వంటగ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఆధార్ వివరాలు సమర్పించి అనుసంధానం చేసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో వంట గ్యాస్ రాయితీ పొందలేరని పేర్కొన్నారు. అంతకుముందు కలెక్టర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ ప్రతీ సిలిండర్‌కు సబ్సిడీ కింద రూ.553 వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమవుతుందని చెప్పారు. ఇలా సంవత్సరంలో తొమ్మిది సబ్సిడీ సిలిండర్లకు సుమారు రూ.5 వేల వరకు ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. జిల్లాలో శనివారం గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారుల ఖాతాల్లో ఆదివారం సాయంత్రానికి రూ.15 లక్షల వరకు జమ కానున్నట్లు తెలిపారు.
 
 జిల్లాలో ఆధార్ అనుసంధానం 61 శాతం పూర్తయినట్లు మంత్రికి వివరించారు. అధికారుల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యమైందన్నారు. గ్యాస్ వినియోగదారులు ఆధార్ అనుసంధానం చేసుకోవడానికి మరో నెల రోజుల గడువు ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, జయింట్ కలెక్టర్ సుజాతశర్మ, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, అదనపు జేసీ వెంకటయ్య, డీఎస్‌వో వసంత్‌రావు దేశ్‌పాండే, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి, బ్యాంకర్లు, గ్యాస్ ఏజెన్సీ యాజమానులు, అధికారులు, డీలర్లు పాల్గొన్నారు. 
 
 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
 ఆదిలాబాద్ రూరల్ :  పట్టణం, మండలంలో పలు అభివృద్ధి పనులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్య ఆదివారం శంకుస్థాపన చేశారు. మండలంలోని మావల పంచాయతీ పరిధి దస్నాపూర్ వద్ద రూ.7 కోట్లతో నిర్మించే వంతెన పనులను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన గురుకుల బాలుర పాఠశాల ఆవరణలో రూ.3 కోట్లతో తలపెట్టిన యూత్ శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గిరిజన బాలికల మేనేజ్‌మెంట్ వసతి గృహం ఆవరణలో రూ. కో టి నిధులతో పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ (బాలికల) భ వన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థినుల వసతి గృహాన్ని పరిశీలించా రు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
 
 మరుగుదొ డ్లు, నీటి సమస్య, స్నానపు గదులు లేక ఇబ్బం దులు పడుతున్నామని తెలిపారు. లైబ్రరీ ఏర్పా టు చేయూలని కోరారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని మంత్రి హాస ్టల్ వార్డెన్‌ను ఆదేశించారు. అంతకు ముందు ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మరిన్ని యూత్ శిక్షణ కేంద్రాలను సు మారు రూ.13 కోట్లతో నిర్మించనున్నామని పే ర్కొన్నారు. 
 
 దస్నాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమైక్యవాదులు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు ఖాయమన్నారు. జిల్లా ప్రజల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. మం త్రి వెంట ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం స క్కు, కలెక్టర్ అహ్మద్ బాబు, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ న్ సంజీవ్‌రెడ్డి, ఏటీడబ్ల్యూవో సంధ్యారాణి, ఐ టీడీఏ ఏఈ సంతోష్, అధికారులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement