మన్నవ సుబ్బారావు
కొరిటెపాడు : కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు స్పష్టం చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన టీఎన్‌టీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంక్షేమ మండలి కార్మికుల పిల్లల వివాహానికి, వికలాంగులైన పిల్లలకు ప్రోత్సాహం కల్పిస్తోందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని కోరారు. ఆటో డ్రైవర్లకు గతంలో విద్యార్హత లేకపోయినా లెసైన్సులు మంజూరు చేశారని, కానీ లెసైన్సు రెన్యువల్ సమయంలో విద్యార్హత సర్టిఫికెట్ అడుగుతున్నారని, దీంతో ఎన్నో ఏళ్లుగా ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్న వారు భుక్తి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో టీఎన్‌టీయూసీ నాయకులు నారా జోషి, గుంటుపల్లి శేషగిరిరావు, శ్యామ్ సుందర్, పార్టీ నాయకులు లాల్‌వజీర్, డి.నరేంద్ర పాల్గొన్నారు.
కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు స్పష్టం చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన టీఎన్‌టీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంక్షేమ మండలి కార్మికుల పిల్లల వివాహానికి, వికలాంగులైన పిల్లలకు ప్రోత్సాహం కల్పిస్తోందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని కోరారు. ఆటో డ్రైవర్లకు గతంలో విద్యార్హత లేకపోయినా లెసైన్సులు మంజూరు చేశారని, కానీ లెసైన్సు రెన్యువల్ సమయంలో విద్యార్హత సర్టిఫికెట్ అడుగుతున్నారని, దీంతో ఎన్నో ఏళ్లుగా ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్న వారు భుక్తి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో టీఎన్‌టీయూసీ నాయకులు నారా జోషి, గుంటుపల్లి శేషగిరిరావు, శ్యామ్ సుందర్, పార్టీ నాయకులు లాల్‌వజీర్, డి.నరేంద్ర పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమమే టీడీపీ ధ్యేయం
Published Thu, Mar 17 2016 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM
Advertisement
Advertisement