Workers Welfare
-
వ్యవస్థల్లో అవినీతిని ఏరిపారేయండి
సాక్షి, అమరావతి: వ్యవస్థల్లో అవినీతిని ఏరిపారేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో అవినీతి ఉండకూడదని, అవినీతి వల్ల పేదలైన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన కార్మికుల సంక్షేమం, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో జరిగిన అవినీతి గురించి సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. మందులు కొనాల్సిన డబ్బులతో కాస్మొటిక్స్ కొన్నారని అధికారులు వివరించారు. ఎల్ఐసీ నుంచి బీమా చెల్లింపులు నిలిచిపోయాయని, ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. బీమా చెల్లింపుల కోసం ప్రధానికి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ ఆసుపత్రుల్లో సేవలు మెరుగు పరచడం, మందుల కొనుగోళ్లు తదితర అంశాలపై ఆయన అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సీఎం సూచనలు, ఆదేశాలు - మందుల కొనుగోలులో పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలి. - ఈఎస్ఐ కొనుగోలు చేసిన మందుల్లో జీఎంపీ (గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలు ఉండాలి. - ఈఎస్ఐ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. - వైద్య సేవల్లో నాణ్యత కోసం ఇప్పటికే నిర్దేశించుకున్న ప్రమాణాలు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలి. - ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక టీచింగ్ ఆసుపత్రి, నర్సింగ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నాం. - ఇప్పుడున్న టీచింగ్ ఆస్పత్రుల సంఖ్యను 11 నుంచి 27కు పెంచుతున్నాం. - ఈ కాలేజీల నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు అందుబాటులోకి వస్తారు. - వీరి సేవలను కూడా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వినియోగించుకునేలా చూడాలి. - వైద్య ఆరోగ్య శాఖతో అనుసంధానమైన ఈఎస్ఐ ఆస్పత్రులను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. - కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై వెంటనే అధికారులు దృష్టి పెట్టాలి. - ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఏమైనా సేవలు మెరుగుపరిచేందుకు ప్రతిపాదనలు పంపితే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. - కాలుష్య నివారణపైనా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడుకోవాలి. - కాలుష్యం వల్ల కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలుష్య నివారణ ప్రమాణాలు ప్రదర్శించాలి. - సముద్రంలోకి విచ్చలవిడిగా వ్యర్థాలను వదిలేయడం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. దీంతో భావితరాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటాయి. దీన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. -
కార్మికుల సంక్షేమంలో తెలంగాణ రోల్ మోడల్
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం తన నివాసంలో కలసిన రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు, ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలను అమలు చేస్తోందని వినోద్ పేర్కొన్నారు. ప్రమాదంలో కార్మికుడు చనిపోతే రూ. 6 లక్షలు చెల్లిస్తోందన్నారు. ఆడపిల్ల పుడితే రెండు కాన్పుల వరకు ఒక్కొక్కరికి రూ. 30 వేల చొప్పున, ఆడపిల్ల పెళ్లికి మరో రూ. 30 వేలు అందజేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు సంఘం రూపొందించిన గుర్తింపు కార్డులను అందజేశారు. సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు జాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలస్వామి, కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇప్పటికి అద్దె బస్సులే’
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దానికి వెంటనే కాయకల్ప చికిత్స అవసరం. ఈ దిశగా నా ప్రయత్నం మొదలైంది. నాలుగేళ్లుగా బస్ చార్జీలు పెంచలేదు. దీంతో టికెట్ రూపంలో వచ్చే ఆదాయంలో పెరుగుదల లేదు. కొన్నేళ్లుగా డీజిల్ ధర విపరీతంగా పెరిగింది. ఆ రూపంలో ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇక గతంలో కార్మికుల సంక్షేమం కోసం ఉదారంగా వేతన సవరణ చేయటం వల్ల స్వతహాగా పడ్డ భారం కూడా తోడైంది. దీంతో కొంత కాలంగా ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులను చవిచూస్తోంది. పరిస్థితి చక్కదిద్దేందుకు త్వరలోనే చర్యలు ప్రారంభమవుతాయి. శాసనసభ సమావేశాలు ముగియగానే వీలు చూసుకుని సీఎం కేసీఆర్‌తో చర్చించి తరుణోపాయంతో ముందుకు సాగుతాం’ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవలే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... సమ్మె లేకుండా చర్యలు.. కొద్దిరోజులుగా ఆర్టీసీ కారి్మక సంఘాలు సమ్మె నోటీసు ఇస్తున్నాయి. సంఘాల డిమాండ్లు సం ఘాలకున్నాయి. కానీ సమ్మె చేయడం సంస్థకు క్షేమం కాదు. అందుకే సమ్మెకు వెళ్లకుండా చూసే ప్రయత్నంలో ఉన్నాను. ఆ సంఘాల డిమాండ్లను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించి నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికి అద్దె బస్సులే... ఆర్థిక మాంద్యం వల్ల ఇప్పటికిప్పుడు భారీ వ్యయంతో బస్సులు కొనే పరిస్థితి లేదు. అందుకే అద్దె బస్సులు వీలైనన్ని తీసుకోవాలనుకుంటున్నాం. దాదాపు 800 గ్రామాలకు బస్సు వసతి లేదు. వీటికి అద్దె బస్సులను తీసుకోవాలనుకుంటున్నాం. ఈ విషయంలో కారి్మక సంఘాలతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేస్తాను. ఆర్టీసీ తక్షణావసరాలకు రూ.700 కోట్ల వరకు రుణం తీసుకునే ఆలోచన ఉంది. వాటితో కొన్ని కొత్త బస్సు లు కొనే వీలు కూడా ఉంటుంది. సిటీలోనే ఎక్కువ నష్టాలు... కేంద్రం మంజూరు చేసిన 325 బ్యాటరీ బస్సుల్లో ఎక్కువ మొత్తం సిటీలో తిప్పుతాము. అవి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు కొంతమేర మెరుగైన రవాణా వసతి ఉంటుంది. ఆరీ్టసీ కి సిటీలోనే ఎక్కువ నష్టాలొస్తున్నాయి. ఆరీ్టసీకి రాష్ట్రంలో రూ.50 వేల కోట్ల విలువైన భూములున్నాయి. వీటిని వాణిజ్య అవసరాలకు వీలుగా పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టులు చేపడితే సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతుంది. గతంలో ఈ దిశగా యత్నం జరిగినా, అది విజయవంతం కాలేదు. ఇప్పుడు ఆ ఆలోచనను పట్టాలెక్కించేందుకు చర్యలు తీసుకుంటాను. వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల వేలం ప్రక్రియను ఆన్లైన్లో ఈ– బిడ్డింగ్ ద్వారా నిర్వహించమని చెప్పాను. క్లౌడ్ మెమోరీలో స్పేస్ తీసుంటాం... రవాణాశాఖలో సేవలు ఆన్లైన్లో ఉండటంతో వాహనదారులు సంబంధిత యాప్ డౌన్లోడ్ చేసుకుని వాహనం డాక్యుమెంట్లన్నీ ఆ యాప్ సాయంతో స్టోర్ చేసుకుంటున్నారు. దీంతో రవాణాశాఖ సర్వర్ సామర్థ్యం సరిపోక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కొత్తగా మరో సర్వర్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కానీ కొత్త సర్వర్ బదులు క్లౌడ్ మెమోరీలో కావాల్సినంత స్పేస్ కొనమని ఆదేశించాను. కనీసం వచ్చే 15 ఏళ్లకు సరిపడేలా ఈ స్పేస్ ఉండనుంది. -
యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు
పెబ్బేరు/భూత్పూర్: రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కరువు నివారణ చర్యలు చేపట్టాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలో పూర్తి కరువు ఏర్పడిందన్నారు. ఆదివారం మే డే వేడుకల్లో భాగంగా ఆయన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, పెబ్బేరు మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ని నాలుగు జిల్లాల్లో జేఏసీ ఆధ్వర్యంలో కరువు పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదికలను జిల్లాల కలెక్టర్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు అందజేశామని వివరించారు. త్వరలో గవర్నర్ నరసింహన్నూ కలవనున్నట్లు తెలిపారు. పంటలు, పండ్లతోటలు దెబ్బతిని రైతులు అప్పులపాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కనీసం ఎకరాకు రూ.10 వేలు తగ్గకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఇప్పుడు ఆదుకుంటేనే వచ్చే ఖరీఫ్‌లో తిరిగి పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయి చెరువులను నీటితో నింపి ఉంటే ఇంతటి కరువు వచ్చేది కాదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో వృద్ధులు, వికలాంగులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా టీజేఏసీ పాత్ర ప్రముఖంగా ఉంటుందని కోదండరాం స్పష్టంచేశారు. కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న సరళీకరణ చట్టాల ఫలితంగా కార్మికుల సంక్షేమం డోలాయమానంలో పడిందని కోదండరాం ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులను నియమిస్తూ ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయని చెప్పారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు. -
కార్మికుల సంక్షేమమే టీడీపీ ధ్యేయం
మన్నవ సుబ్బారావు కొరిటెపాడు : కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు స్పష్టం చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన టీఎన్టీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంక్షేమ మండలి కార్మికుల పిల్లల వివాహానికి, వికలాంగులైన పిల్లలకు ప్రోత్సాహం కల్పిస్తోందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని కోరారు. ఆటో డ్రైవర్లకు గతంలో విద్యార్హత లేకపోయినా లెసైన్సులు మంజూరు చేశారని, కానీ లెసైన్సు రెన్యువల్ సమయంలో విద్యార్హత సర్టిఫికెట్ అడుగుతున్నారని, దీంతో ఎన్నో ఏళ్లుగా ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్న వారు భుక్తి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో టీఎన్టీయూసీ నాయకులు నారా జోషి, గుంటుపల్లి శేషగిరిరావు, శ్యామ్ సుందర్, పార్టీ నాయకులు లాల్‌వజీర్, డి.నరేంద్ర పాల్గొన్నారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు స్పష్టం చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన టీఎన్టీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంక్షేమ మండలి కార్మికుల పిల్లల వివాహానికి, వికలాంగులైన పిల్లలకు ప్రోత్సాహం కల్పిస్తోందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని కోరారు. ఆటో డ్రైవర్లకు గతంలో విద్యార్హత లేకపోయినా లెసైన్సులు మంజూరు చేశారని, కానీ లెసైన్సు రెన్యువల్ సమయంలో విద్యార్హత సర్టిఫికెట్ అడుగుతున్నారని, దీంతో ఎన్నో ఏళ్లుగా ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్న వారు భుక్తి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో టీఎన్టీయూసీ నాయకులు నారా జోషి, గుంటుపల్లి శేషగిరిరావు, శ్యామ్ సుందర్, పార్టీ నాయకులు లాల్‌వజీర్, డి.నరేంద్ర పాల్గొన్నారు. -
ఫ్యాక్టరీల్లో ప్రమాదాలను అరికట్టాలి: నాయిని
హైదరాబాద్: కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. క్లస్టర్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు వృత్తిపరంగా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పేలుళ్ల బారి నుంచి రక్షణ తదితర అంశాలపై బుధవారం రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్ కేఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో శిక్షణ శిబిరం జరిగింది. ముఖ్య అతిథిగా నాయిని హాజరై శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 528 క్లస్టర్ ఫ్యాక్టరీలున్నాయి. వాటిలో సిలికా, ఇసుక వాడటం వల్ల కార్మికులు విపరీతమైన దుమ్ము, పొగ, భారీ శబ్దాలతో సహవాసం చేస్తూ అనారోగ్యాలకు గురవుతుంటారు. కార్మికులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు బలైపోతుంటారు. దీర్ఘకాలికమైన వ్యాధుల్లో శ్వాసకోశ వ్యాధులు అధిక ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యాధుల బారిన పడిన కార్మికులకు వైద్య పరీక్షలు చేయించాల్సిన బాధ్యత చట్టపరంగా ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలదే. కంకర మిషన్లు, గ్రానైట్ తయారీ మిషన్ల వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన అవసరముంది’’ అని ఆయన చెప్పారు. కార్మికులను తొలగించడం దుర్మార్గం రాజ్యాంగ పరంగా కార్మికుల సంక్షేమం కోసం కార్మికులందరితో ఒక యూనియన్ను స్థాపించుకునే అవకాశం ఉందని నాయిని అన్నారు. చైతన్యవంతులైన కార్మికులు యూనియన్లను ఏర్పాటు చేసుకుంటే వారిని నిర్దాక్షిణంగా, మానవత్వం లేకుండా విధుల నుంచి తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేసే కార్మికులను తొలగించడం దుర్మార్గమని, తొలగించిన యాజమాన్యాలపై ఎంత టి కఠిన చర్యలు తీసుకున్నా తప్పు లేదని అన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవించే హక్కును కల్పించిందని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్ సింగ్ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఈఎస్ఐ జాయింట్ డెరైక్టర్ పద్మ, పరిశ్రమల శాఖ ఇన్‌ఛార్జి కిషన్ తదితరులు పాల్గొన్నారు. గనులు, ఫ్యాక్టరీ కార్మికులకు ప్రమాదాలు జరగకుండా వినియోగించే పరికరాలు, ప్రమాదాలకు గురైతే చేపట్టే వైద్య సేవల పనిముట్ల ప్రదర్శనను నాయిని ప్రారంభించారు. బండరాళ్ల పేలుళ్ల నుంచి ప్రాణ రక్షణ పొందడం, డిటోనేటర్లను పేల్చడం తదితర అంశాలపై శ్రీకాంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే గనుల్లో సంభవించిన పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో ప్రశాంత్ మానుకర్ వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు పొందాల్సిన వైద్యసేవల వివరాలను డాక్టర్ పి.వి.రావు తెలిపారు. -
సిరిసిల్లలో టెక్స్టైల్స్ అడ్వైజరీ కమిటీ
- పదిహేను మంది సభ్యులుండే అవకాశం - మరో నాలుగు ప్రత్యేక కమిటీలు - నేత కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి - వస్త్ర పరిశ్రమపై సర్కారు ఆజమారుుషీ - కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం - ఆటుపోట్ల వస్త్ర పరిశ్రమకు ఊరట లభించేనా? సిరిసిల్ల : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తరచూ ఎదుర్కొంటున్న ఆటుపోట్లను అధిగమించేం దుకు టెక్స్టైల్స్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆత్మహత్యలు, ఆకలిచావులు, సమ్మెలు, సంక్షోభాల వస్త్ర పరిశ్రమను ఒడ్డుకు చేర్చేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతోంది. ప్రైవేటు యాజమాన్యం చేతుల్లో ఉన్న వస్త్ర పరిశ్రమపై ప్రభుత్వ పరంగా అజమాయిషీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. సిరిల్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 34వేల మరమగ్గాలు ఉండగా, 25వేల మంది కార్మిక కుటుంబాలు వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డాయి. అంతర్జాతీయంగా నూలు ధరలు పెరగడం, తగ్గడం వంటి సమస్యలతో వస్త్ర పరిశ్రమ తరచూ కుదేలవుతోంది. ఇక్కడ ఉత్పత్తయిన గుడ్డకు ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో వస్త్రోత్పత్తుల కొనుగోళ్లు ఆధారపడి ఉండడంతో ప్రభుత్వ పరంగా అజమాయిషీ లేదు. దీంతో వస్త్రం అమ్మక నిల్వలు పేరుకుపోయి పెట్టుబడులు లేక యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లకోసారి కూలీ రేట్లు పెంచడం, పాలిస్టర్, కాటన్ గుడ్డ ఉత్పత్తిలో పన్నెండు గంటల పాటు శ్రమిస్తున్నా గిట్టుబాటు కూలీ రావడం లేదని కార్మికులు సమ్మె చేయడం పరిపాటిగా మారింది. ఈ సమస్యలన్నింటీపై సమగ్ర అధ్యయనం, సహేతుకమైన కూలీ రేట్ల నిర్ణయం, పని గంటల విధానం వంటి అంశాలపై అధ్యయనం చేసి అధికారులు, పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాల నేతలు, జౌళి శాఖ అధికారులు సభ్యులుగా మొత్తం 15 మందితో అడ్వైజరీ కమిటీ నియమించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందులో నాలుగు కమిటీలు వేసి వస్త్ర పరిశ్రమ సంక్షోభాలను అధిగమించాలని భావిస్తోంది. కమిటీ ఏం చేస్తుందంటే... అడ్వరుజరీ కమిటీ పర్యవేక్షణలో వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, భవిష్యత్‌లో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తిస్తూ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన సహకారాన్ని నిర్దేశించనుంది. వస్త్రాన్ని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేయని పక్షంలో స్థానికంగా నిల్వ చేసి యజమానులకు బ్యాంకు రుణాలు ఇప్పించడం, తక్కువ వడ్డీతో వస్త్ర పరిశ్రమ నడిచేలా చర్యలు తీసుకోవడం, కార్మికులకు నిరాటంకంగా ఉపాధి కల్పించడం వంటి చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేస్తూ వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుంది. సిరిసిల్లలో పన్నెండు గంటల పని విధానం అమలవుతుండగా, దాన్ని కుదించడం, అవసరమైన సమయాల్లో పెంచుకోవడం, కార్మికుల మనోభావాలను గుర్తించడం, ఆర్థిక ఇబ్బందులున్న కార్మిక కుటుంబాలకు ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం వంటివి కమిటీ పర్యవేక్షణలో జరుగుతారుు. అలాగే వస్త్ర పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, వారికి ఎదురయ్యే ఆరోగ్య పరమైన సమస్యలను అధిగమించడం, దురలవాట్లకు దూరంగా ఉంచేందుకు కౌన్సెలింగ్ నిర్వహించడం, పింఛన్లు, అంత్యోదయ కార్డులు, పని భద్రత కల్పించడం, సామూహిక బీమా సదుపాయం, కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు ఇవ్వడం, కార్మిక కుటుంబాల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి ప్రత్యక్షంగా కార్మికుల సంక్షేమానికి పాటుపడడం ఈ కమిటీ లక్ష్యం. ఆత్మహత్యల నివారణపై దృష్టి సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం, కమ్యూనిటీ ఫెసిలిటేటర్ల సంఖ్యను పెంచి కార్మికుల స్థితిగతులపై నిఘా ఉంచడం వంటి చర్యలను కమిటీ చేపట్టనుంది. ప్రస్తుతం కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఉండగా, మరో ఎనిమిది మందిని నియమించి కార్మిక క్షేత్రంలో మానసిక వేదనకు గురయ్యే నేతన్నలను గుర్తించేందుకు కమిటీ పని చేస్తుంది. కూతురు పెళ్లి చేసేందుకు ఇబ్బందిపడేవారు, ఇతర ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారిని మహిళా సంఘాల సాయంతో గుర్తించడం వంటి మార్గాల్లో నేతన్నల ఆత్మహత్యలను నివారించానికి కృషి చేస్తుంది. కార్మిక వాడల్లో సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించడం, మద్యానికి బానిసైన వారిని ఆ వ్యసనం నుంచి దూరం చేయడం వంటి చర్యలను ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. మొత్తంగా టెక్నికల్, నాన్‌టెక్నికల్ పారిశ్రామికవేత్తలు, జౌళి శాఖ అధికారులు, వస్త్ర వ్యాపారులు, కార్మిక నేతలతో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి కోసం కమిషనర్‌ను నియమించి, పార్క్ నిర్వహణతో పాటు మౌలిక సదుపాయూలను మెరుగుపర్చడం మరో ప్రధానమైన ఉద్దేశం. -
7 రూపాయలతో ఎన్ని ప్రయోజనాలో..
సాక్షి, హైదరాబాద్ : దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లలో పనిచేసే కార్మికు ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ నిధి ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అటు యజమానులకు, ఇటు కార్మికులకు వీటిపై సరైన అవగాహన లేక ఈ ప్రయోజనాలను కార్మికులు, ఉద్యోగులు పొందలేకపోతున్నారు. కేవలం ఏడాదికి ఏడు రూపాయలు చెల్లిస్తే కార్మికులకు, వారి కుటుంబాలకు ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. వీరికే వర్తింపు.. కార్మిక సంక్షేమ నిధి చట్టం (1987) ద్వారా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి నిర్వహణ కోసం కార్మిక సంక్షేమ మండలిని ఏర్పాటు చేశారు. దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం(1988) కింద పేర్కొన్న సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 1948 ఫ్యాక్టరీ చట్టం కింద పేర్కొన్న కంపెనీలలో పనిచేసే కార్మికులు 1961 మోటారు రవాణా సిబ్బంది చట్టం కింద పనిచేస్తున్న కార్మికులు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ యాక్టు కింద నమోదైన సహకార సంఘాలు ధర్మాదాయ, ఇతర ట్రస్టులలో పనిచేసే ఉద్యోగులు ఈ సంక్షేమ నిధి చట్టం పరిధిలోకి వస్తారు. ఏడాదికి ప్రతి ఉద్యోగి తన వాటాగా రూ.2, ప్రతి ఉద్యోగి తరఫున యజమాని వాటాగా రూ.5 ఈ నిధికి చెల్లించాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాలివే.. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స : క్యాన్సర్, కిడ్నీ, బ్రెయిన్ ట్యూమర్, గుండె జబ్బు, పక్షవాతం, గర్భసంచి చికిత్స, ట్రామాకేర్ కింద చికిత్స పొందుతున్న కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు రూ. 20 వేల వరకు ఆర్థికసాయం అందిస్తారు. చికిత్స ప్రారంభించిన ఏడాదిలోపు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. మరణిస్తే : కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 20 వేలు, సహజ మరణం పొందితే రూ.10 వేలు అందజేస్తారు. కార్మికుడు మరణించిన తేదీ నుంచి ఏడాదిలోపు అతని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలి. అంత్యక్రియలకు: మరణించిన కార్మికుని అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5వేలు అందిస్తారు. కార్మికుడు మరణించిన ఆరు నెలలలోపు అతని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలి. అంగవైకల్యం సంభవిస్తే : ప్రమాదం కారణంగా అంగవైకల్యం సంభవించినట్లయితే రూ.20 వేలు అందజేస్తారు. ఎయిడ్స్ చికిత్స : ఎయిడ్స్ రోగులకు రూ.20 వేలు ఆర్థికసాయం అందజేస్తారు. వివాహ కానుక : ప్రతి ఏడాది కార్మికుని కుమార్తె(కుటుంబం లో ఒకరికి మాత్రమే), మహిళా కార్మికుల వివాహం సందర్భంగా రూ.9వేలు ఫిక్సిడ్ డిపాజిట్ రూపంలో, రూ.1000 ఖరీ దుకు మించకుండా ప్రెషర్కుక్కర్ను కానుకగా అందిస్తారు. ప్రసూతి, కుటుంబ నియంత్రణ పథకం : ఈ పథకం కింద మహిళా కార్మికులకు ప్రసూతి సమయంలో రూ.5వేలు (ఇద్దరు పిల్లలకు మాత్రమే) అందిస్తారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న కార్మికులకు రూ.2వేలు అందజేస్తారు. కార్మికుల పిల్లల చదువులకు : కార్మికుల పిల్లలు చదివే కోర్సుల ప్రకారం ఏడాదికి పదో తరగతి, ఐటీఐలకు రూ.1000, పాలిటెక్నిక్‌కు రూ.1,500, ఇంజినీరింగ్, మెడిసిన్, లా, బీఎస్సీ (అగ్రి, హార్టికల్చర్), బీఏఎంఎస్, బీడీఎస్, డీఎంఎల్టీ, ఎంఎల్టీ, బీవీఎస్సీ, బీఫార్మసీ, బీసీఏ, ఎంసీఏ, బీబీఏ, ఎంబీఏ, డీహెచ్ఎంఎస్ తదితర కోర్సులకు రూ.2వేలు వంతున ఉపకార వేతనాలు అందిస్తారు. వికలాంగ విద్యార్థులకు : వికలాంగులైన విద్యార్థులకు ఏడాదికి రూ.2వేలు స్కాలర్షిప్ను అందిస్తారు. ఉచిత శిక్షణ: కార్మికుల కుటుంబ ఆదాయాన్ని పెంచేందుకు కుటుంబ సభ్యులకు వివిధ వృత్తులలో ఉచిత శిక్షణ ఇప్పిస్తారు. -
పెరిగిన సింగరేణి స్కూల్ ఫీజులు
శ్రీరాంపూర్ : కార్మికుల సంక్షేమంలో భాగంగా సింగరేణి ఏర్పాటు చేసిన పాఠశాలలు రానురాను ప్రైవేటు పాఠశాలలుగా మారుతున్నాయి. నామమాత్రం ఫీజులతో విద్యాబోధన చేయాల్సిన ఈ పాఠశాలల్లో ఫీజుల పెంపు తల్లిదండ్రులకు భారంగా పరిణమించింది. సంస్కరణల మూలంగా సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే పలు పాఠశాలలను మూసివేశారు. ఉన్నవి కూడా మూతపడేలా యజామాన్యం వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే ఈ విద్యాసంవత్సరం నుంచి ఫీజులు పెంచుతూ యాజమాన్యం కొద్ది రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది కంటే రెండు, మూడు రేట్లు ఫీజులు పెరగడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క సారిగా ఇంత భారం మోపుతారా అని ప్రశ్నిస్తున్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫీజులు తగ్గించాలని వారు కోరుతున్నారు. పెంచిన ఫీజులు తగ్గించాలి పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలి. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం. చాలా మంది కార్మికుల పిల్లలు, ప్రైవేటు పిల్లలు ఇప్పుడిప్పుడే కంపెనీ పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రైవేటు పాఠశాలల వలే ఫీజులు పెంచడంతో వచ్చే పిల్లలు కూడా రాకుండా పోతారు. - వేముల కిరణ్‌కుమార్, బీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పాఠశాలలను మూసివేసే కుట్ర సింగరేణి యాజమాన్యం ఉన్న పాఠశాలలను మూసివేసే కుట్ర చే స్తోంది. ఇప్పటికే చాలా పాఠశాలలను మూసివేశారు. కోట్ల లాభాలు ఆర్జిస్తున్న సింగరేణి లాభార్జన కోసం కాకుండా ఈ ప్రాంత వాసుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని స్వల్ప ఫీజులకే విద్యాబోధన చేయాలి. ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కంపెనీ బాధ్యత. - పెరక మహేందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి