ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయం
టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు
కొరిటెపాడు(గుంటూరు): ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన టీడీపీ జిల్లా మైనారిటీ సెల్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదరికంలో ఉన్న ముస్లింలను పైకి తీసుకురావాల్సిన బాధ్యత మైనారిటీ సెల్‌పై ఉందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకుందని ధ్వజమెత్తారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ మాట్లాడుతూ జిల్లాలో ముస్లింలకు పదవులు కట్టిబెట్టింది టీడీపీనేనన్నారు. ముస్లింల రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి ఎమ్మె ల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి,డొక్కా మాణిక్యవరప్రసాదులు మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గంతో జీవీ ఆంజనేయులు ప్రమాణం చేయించారు. మైనారీటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అమీర్ ఆలీ, పార్టీ నాయకులు మద్దాళి గిరిధర్, గంజి చిరంజీవి, మన్నవ సుబ్బారావు, ఎండీ హిదాయత్‌లు పాల్గొన్నారు.