సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం | The goal of full literacy | Sakshi
Sakshi News home page

సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం

Published Sat, Aug 16 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం

సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం

రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించేం దుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లాలో విస్త­ృతంగా అమలు చేసి 2 వేల 374 మంది బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించామన్నారు. నిరుపేదలకు ఆరోగ్య సదుపాయం కల్పించేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం కింద ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించనున్నట్టు మంత్రి తెలిపారు. అక్టోబర్ 2 నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రూ.2కే 20 లీటర్ల మంచినీటిని ప్రతి ఇంటికి అందిస్తామన్నారు.

ఇళ్లకు 24 గంటలు, రైతులకు 9 గంటలు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించనున్నట్టు చెప్పారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదవారికి అల్పాహారం రూ.5, సాంబారన్నం రూ.7.50, పెరుగన్నం రూ.6.50, రెండు చపాతీలు, కూర రూ.7.50లకే అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో అరకు ఉత్సవ్, డిసెంబర్‌లో విశాఖ ఉత్సవ్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement