ప్రజా సంక్షేమమే జగన్ లక్ష్యం
సాక్షి, తిరుపతి: ప్రజాసంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఆ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఆయన రెండు రోజుల నిరాహారదీక్షకు కూర్చు న్నారు. ఆయన మాట్లాడుతూ జైలు నుంచి జగన్‌మోహన్‌రెడ్డి విడుదలైనప్పటినుంచి ప్రజల మధ్య గడపుతున్నారని అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఈ నెలలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల కార్యాచరణను ప్రకటించారని తెలిపారు.
రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే తమ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారని అన్నారు. వీరి చర్యను టీడీపీ నేతలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. 38 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబా బు ఆలోచనలు మాత్రం పాతాళంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు మాట్లాడుతూ విభజన జరిగితే సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. చంద్రబా బు కాంగ్రెస్‌తో రహస్య పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే నిత్యం ప్రజల మధ్య గడుపుతున్నారని అన్నారు.
పులుగోరు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆంధ్రలో జన్మించిన వాడేనని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు హనుమంతరావు ప్రజల చేత దెబ్బలు తిన్న నాయకుడని తెలిపారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సమైక్యాంధ్ర కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. కాంగ్రెసు నాయకుడు సబ్బంహరి స్వప్రయోజనాల కోసం, వైఎస్సార్ కాంగ్రెస్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.
పార్టీ నాయకుడు ఎస్‌కే.బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, బీసీ కమిటీ సభ్యులు ఎల్లయ్య, కట్టా జయరాంయాదవ్, సింగిల్ విండో మాజీ సభ్యుడు రామచంద్రారెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకుడు చంద్రయ్య, పార్టీ నాయకులు మణ్యం చంద్రశేఖర్‌రెడ్డి, తొండమనాటి వెంకటేష్, కొమ్ము చెంచయ్య యాదవ్, చందూరాయల్, న్యాయవాది చంద్రశేఖర్, తిరుమలయ్య, వెంకటముని, నాగిరెడ్డి, ముద్రనారాయణ, శాంతారెడ్డి, గీత, సుశీలమ్మ, గీతారెడ్డి, ప్రమీల, గౌరి పాల్గొన్నారు.