చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండల కేంద్రంలోని చారిత్రక కోటలో భూమి కుంగి.. సొరంగ మార్గం భయట పడింది. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా.. కోటలోని ఓ ప్రాంతంలో బుధవారం ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. దీంతో 30 అడుగుల లోతు పది అడుగుల వెడల్పు ఉన్న పెద్ద గుంట ఏర్పడింది. కోటలోని ఈద్గా సమీపంలో ఏర్పడిన ఈ గుంత కింద సొరంగ మార్గం ఉందని స్థానికులు అంటున్నారు. సొరంగం ఉండటంతోనే భూమి ఒక్కసారిగా కుంగిపోయిందని చెబుతున్నారు. పురాతత్వ శాఖకు సమాచారం అందించారు.