మున్సిపాలిటీ విజయం వైఎస్సార్‌కు అంకితం
వేంపల్లె, పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల విజయం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అంకితమని మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ పేర్కొన్నారు. సోమవారం కడపలో మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పులివెందుల మున్సిపాలిటీ వైఎస్సాఆర్‌సీపీ కైవసం కావడంతో వారు కొంతమంది కౌన్సిలర్లు కలిసి ఇడుపులపాయకు వెళ్లి మహానేత వైఎస్సాఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. పులివెందుల మున్సిపాలిటీ విజయం వైఎస్సాఆర్‌కేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలలో కూడా వైఎస్సాఆర్ సీపీ విజయ కేతనం ఎగురవేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ మనోహర్‌రెడ్డి వైఎస్ కిరణ్‌రెడ్డి, కోడలు వైఎస్ శిల్పారెడ్డి, కౌన్సిలర్లు వరప్రసాద్, చిన్నప్ప, కోడి రమణ, చెన్నారెడ్డి, వెంకటపతి, తదితరులతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.