pulivendula Municipality
-
ఏపీ కార్ల్‌లో పశువుల వ్యాక్సిన్ తయారీ యూనిట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరంగాపురం సమీపంలో ఉన్న ఏపీ కార్ల్ (ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడావ్న్స్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్)లో పశువులకు సంబంధించిన వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందంపై ఏపీ కార్ల్ సీఈఓ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ డాక్టర్ ఆదినారాయణరెడ్డి మధ్య సంతకాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పశువులకు అవసరమైన వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నందున రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి కొన్నాళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ► ఈ నేపథ్యంలో పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం కోసం ఒప్పందం కుదిరింది. తద్వారా 2021 నుంచి పశువులకు అవసరమైన అన్ని రకాల వ్యాక్సిన్ల తయారీ మొదలవుతుంది. ► గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్ల రోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతు వాపు, జబ్బ వాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్లు తయారవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తుంది. ► ఈ ఒప్పందం ద్వారా ఐజీవై దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 100 మంది నిపుణులు, సిబ్బందికి ఉపాధి కలుగనుంది. ► మన రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఇతర రా>ష్ట్రాలకు ఎగుమతి చేస్తుంది. ప్రపంచ స్థాయి వ్యాక్సిన్ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
పన్ను వసూళ్లలో పులివెందుల ఫస్ట్
పులివెందుల టౌన్ : ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి 99.68 శాతం ఇంటి పన్ను వసూళ్లతో రాష్ట్రంలో పులివెందుల మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ సమావేశం నిర్వహించి అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. పన్నులు చెల్లించడంలో ప్రజలు సహకరించినందున, వారి సమస్యలు సత్వరమే పరిష్కరించడానికి మున్సిపల్ ఉద్యోగులు చొరవ చూపాలన్నారు. మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద చెట్లు పెంచి స్మార్ట్ వార్డులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. వ్యాపారపరమైన కొళాయి కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వార్డుల్లో అపరిశుభ్రత లేకుండా కౌన్సిలర్లు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప, మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఆర్ఓ రంగారావు, డీఈలు శేఖర్, ఓంప్రకాష్, ఏఈలు రామకృష్ణారెడ్డి, సుమన్‌రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రాముడు, మేనేజర్ మురళి తదితరులు పాల్గొన్నారు. -
అరటి తోట బుగ్గిపాలు
పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లెలో ఆరు ఎకరాల్లో అరటి తోట అగ్నికి ఆహుతైంది. బాధితుల కథనం మేరకు.. బ్రాహ్మణపల్లె మాజీ సర్పంచ్ మల్రెడ్డి ఆరు ఎకరాల్లో అరటి సాగు చేశారు. ఇంకో నెలలో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఉన్నట్లుండి మంటలు వ్యాపించడాన్ని సమీపంలోని తోటల రైతులు గమనించారు. మల్రెడ్డి, అగ్నిమాక శాఖ అధికారులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఫైర్‌స్టేషన్ అధికారి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. పక్క తోటలకు మంటలు వ్యాపించకుండా పొలం గట్లను నీటితో తడిపారు. దీంతో పక్క తోటల రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయని, పంట పూర్తిగా పోయిందని బాధిత రైతు మల్రెడ్డి తెలిపారు. రూ.10 లక్షలు నష్టం సంభవించిందన్నారు. తోటలో ఎండిన ఆకులు అధికంగా ఉండటంతో మంటలు చెలరేగాయి. ఎండిన అరటి ఆకులు తొలగించాలని అగ్ని మాపక శాఖాధికారులు సూచిస్తున్నా, తేమ ఆరిపోకూడదని రైతులు ఆ పని చేయడం లేదు. కాగా ఇది ప్రమాదమా, లేక ఆకతాయిల పనా అన్నది స్పష్టం కాలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైఎస్ మనోహర్‌రెడ్డి అగ్ని ప్రమాదంలో కాలిపోయిన అరటి తోటను వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మున్సిపల్ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్పలు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు వరప్రసాద్, చెన్నారెడ్డి, రామనాథ్, రమాదేవి, వైఎస్ఆర్ సీపీ నాయకులు రామచంద్రారెడ్డి, శివకుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాసులరెడ్డి తదితరులు ఘటనా స్థలిని పరిశీలించారు. -
మున్సిపాలిటీ విజయం వైఎస్సార్‌కు అంకితం
వేంపల్లె, పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల విజయం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అంకితమని మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ పేర్కొన్నారు. సోమవారం కడపలో మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పులివెందుల మున్సిపాలిటీ వైఎస్సాఆర్సీపీ కైవసం కావడంతో వారు కొంతమంది కౌన్సిలర్లు కలిసి ఇడుపులపాయకు వెళ్లి మహానేత వైఎస్సాఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. పులివెందుల మున్సిపాలిటీ విజయం వైఎస్సాఆర్కేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలలో కూడా వైఎస్సాఆర్ సీపీ విజయ కేతనం ఎగురవేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ మనోహర్‌రెడ్డి వైఎస్ కిరణ్‌రెడ్డి, కోడలు వైఎస్ శిల్పారెడ్డి, కౌన్సిలర్లు వరప్రసాద్, చిన్నప్ప, కోడి రమణ, చెన్నారెడ్డి, వెంకటపతి, తదితరులతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.