
తిరుపతి అర్బన్: తిరుపతికి పెరుగుతున్న రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 6 ప్రత్యేక రైళ్లను నడపనుంది. వీటిలో తత్కాల్ చార్జీలు అమలు చేస్తున్నట్లు రైల్వే కమర్షియల్ అధికారులు తెలిపారు.
- 07608 నంబర్‌తో నడిచే రైలు ప్రతి బుధవారం మధ్యాహ్నం 3.45 కు తిరుపతిలో బయలుదేరి గూడురు, విజయవాడ, సికింద్రాబాద్ మీదుగా నాందేడు వరకు నడుస్తుంది.
- 07146 నంబర్‌తో నడిచే రైలు ప్రతి గురువారం సాయంత్రం 5కు తిరుపతిలో బయలుదేరి గూడురు, విజయవాడ, ఖాజీపేట మీదుగా కాచిగూడ వరకు నడుస్తుంది.
- 07417 నంబర్‌తో నడిచే రైలు ప్రతి శుక్రవారం ఉదయం 7.30కు తిరుపతిలో బయలుదేరి గూడురు, తెనాలి, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా నాగర్‌సోల్(షిరిడీ సమీపం) వరకు నడుస్తుంది.
- 08574 నంబర్‌తో నడిచే రైలు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.30కు తిరుపతిలో బయలుదేరి గూడూరు, విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు నడుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment