కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ ఆటకట్టించారు. అతని నుంచి రూ.39 లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలివీ... యానాంలోని దరియాల తిప్ప ప్రాంతానికి చెందిన చప్పిడి వీర వెంకట సత్యనారాయణ(35) కొంతకాలంగా పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
ఇతనిపై ఇటీవల గొల్లపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు ప్రత్యేక పోలీసు బృందం గాలించి మంగళవారం నిందితుడిని పట్టుకుంది. బుధవారం ఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు వెళ్లడించారు. అతడి నుంచి 1,147 గ్రాముల బంగారం, 11.63 కిలోల వెండితో పాటు రూ.3.22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీర వెంకట సత్యనారాయణను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు.