దొంగకు చెప్పే లాభం
దొంగకు చెప్పే లాభం
మెదక్ మున్సిపాలిటి, : దొంగకు చెప్పే లాభం అన్న నానుడిని నిజం చేస్తూ దొంగలు అందివచ్చిన చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మెదక్ పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు శివనాగభూషణం, నీలయ్య కథనం ప్రకారం.. పట్టణంలోని న్యూమార్కెట్‌లో నివాసం ఉండే శివనాగభూషణం, నీలయ్యల ఇళ్లతోపాటు మరో రెండిళ్లకు దొంగలు బయట నుంచి గడియ పెట్టారు.
దొంగతనానికి యత్నంచగా వారికి కుదరలేదు. దీంతో నీలయ్య ఇంటి కిటికీలోంచి బైక్ తాళం చెవి తీసుకొని బైక్‌లోని పెట్రోల్, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారు. దొంగకు చెప్పే లాభం అన్న చందాన్ని నిజం చేస్తూ ఐదు జతల బూట్లు, మూడు జతల చెప్పులను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.