సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్ :
పట్టణంలో పెరుగుతున్న చోరీలు ఆందోళన కల్గిస్తున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక ఆర్డీఓ ఇంటి ఎదుట ఉన్న బట్టల దుకాణం షెట్టర్‌ను గడ్డపారతో పెకిలించి చీరలను అపహరించారు. అదేవిధంగా శనివారం తెల్లవారు జామున కొత్త బస్టాండ్ సమీపంలో పార్కింగ్ చేసిన అలంకారణ ైటె ల్స్‌ను డీసీఎం వ్యాన్‌ను కూడా చోరీ చేశారు. రెండేళ్ల క్రితం పట్టణంలోని రావూస్ రెసిడెన్సీలో 35 తులాల బంగారం చోరీకి గురైంది. గతేడాది ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని అపార్ట్‌మెంట్ నాలుగు ఫ్లాట్లలో ఒకే రోజు వరుస చోరీలు జరిగాయి. రెండు రోజుల క్రితం రావూస్ రెసిడెన్సీలో కొత్త ఏడాది వేడుకలు జరుగుతుండగా మరో వైపు దుండగులు వ్యూహత్మకంగా చోరీలకు పాల్పడ్డారు.
ఈ రెసిడెన్సి సమీపంలో ఉన్న భారత్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్, శివాజీ నగర్‌లోని కిరాణ దుకాణాల్లో కూడా అపహరించారు. ఇదిలా ఉండగా.. కొమటి చెరువు సమీపంలో ఇంటి యజమానురాలికి మత్తు మందు ఇచ్చి నిలువు దోపిడీకి పాల్పడ్డారు. పోలీసుల నిఘా వైఫల్యాలు కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది.
పట్టణం నిద్రపోతున్న వేళ..
సెలవులు, పెళ్లిళ్లకు, శుభ కార్యాలకు వెళ్లినప్పుడు అనివార్యంగా ఇళ్లకు తాళాలు వేయాల్సి వస్తుంది. ఈ విషయాన్ని పసిగడుతున్న చోరులు పకడ్బందీగా వ్యూహ రచన చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అపార్ట్‌మెంట్లు, భారీ భవనాలకు సీసీ కెమెరాలు లేకపోవడంతో చోరులు ఆచూకీ లభ్యం కావడం లేదు. ఇప్పటికైనా పోలీసులు సీసీ కెమెరాలపై చైతన్యం తేవాల్సి ఉంది.
తాళాలున్న ఇళ్లనే టార్గెట్
Published Sun, Jan 5 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement