![జైలుకు తరలిస్తుండగా దొంగ పరార్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51422940869_625x300.jpg.webp?itok=KNoSHTEk)
జైలుకు తరలిస్తుండగా దొంగ పరార్
హైదరాబాద్: అఖీలుద్దీన్ అనే నిందితున్ని పోలీసుకస్టడీ నుంచి చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా పోలీసులపై దాడి చేసి పరారయిన ఈ సంఘటన నగరంలో మంగళవారం జరిగింది. ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్ కేసులో పట్టుబడిన లంబా కేసులో అఖీలుద్దీన్ నిందితుడు. సోమవారం ఎల్బీనగర్ పోలీసులు నిందితున్ని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరి తిరిగి అతన్ని జైలుకు తరలిస్తుండగా ఈఘటన జరిగింది.
అఖీల్ బంధువులు రెండు ద్విచక్రవాహనాలపై వచ్చి వెంట ఉన్న పోలీసు కానిస్టేబుల్ శేఖర్, ఉపేందర్‌లపై కారం(పెప్పర్ స్ప్రే) చల్లి అతన్ని తీసికెళ్లినట్లు తెలుస్తోంది. అఖీల్ సోదరుడు షకీల్ కూడా పలు మార్లు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గాయపడిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.