Thief escape
-
లండన్‌లో మాయమైన కారు... పాకిస్తాన్లో ప్రత్యక్షం
లండన్: అది దాదాపు రూ.2.4 కోట్ల విలువైన ఖరీదైన బెంట్లీ కారు. దాన్ని బ్రిటన్‌లో మాయం చేసిన దొంగలు పాకిస్తాన్లో అమ్మేశారు. అయితే అధునాతన సాంకేతికత సాయంతో దాని జాడను బ్రిటన్ అధికారులు కనుగొన్నారు. మూడు లక్షల డాలర్ల విలాసవంత బెంట్లీ కారు కొన్ని వారాల క్రితం లండన్‌లో చోరీకి గురైంది. ఎట్టకేలకు దాని జాడను బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ పాకిస్తాన్లో కనుగొంది. బ్రిటన్ అధికారులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన కరాచీ కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంపన్నులుండే డీహెచ్ఏ ప్రాంతంలో కారు దాచిన విషయం తెల్సుకున్నారు. ఓ ఖరీదైన భవంతి ప్రాంగణంలో చేసిన సోదాల్లో కారు దొరికింది. అయితే, పాకిస్తాన్ రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్‌తో యజమాని అది పాక్ వాహనమని వాదించే ప్రయత్నం చేశాడు. అయితే, బ్రిటన్ అధికారులు ఇచ్చిన ఛాసిస్ నంబర్ వివరాలు ఈ కారుతో సరిపోలాయి. సరైన వాహన పత్రాలు ఇవ్వడంలో యజమాని విఫలమవడంతో కారును అధికారులు సీజ్ చేశారు. అతడిని, విక్రయించిన బ్రోకర్‌ను అరెస్ట్‌చేశారు. తూర్పు యూరప్‌లోని ఒక దౌత్యవేత్త పత్రాలను అడ్డుపెట్టుకుని కారును అక్రమంగా పాకిస్తాన్‌కు తరలించారని తేలింది. బెంట్లీ కారులోని ట్రేసింగ్ ట్రాకర్‌ను దొంగలు స్విఛ్ ఆఫ్ చేయడం మరిచిపోయారని, అందుకే అధునిక ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా జాడ ఎక్కడుంతో ఇట్టే కనిపెట్టారని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఖరీదైన వాహనాన్ని అక్రమంగా పాక్‌కు తీసుకురావడంతో ఆ దేశం 30 కోట్ల పాక్ రూపాయల పన్నును కోల్పోయింది. ఈ స్మగ్లింగ్ రాకెట్ సూత్రధారి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
దుండగులపై పోలీసు కాల్పులు
గంగావతి: ఇద్దరు దోపిడీ దొంగలు తప్పించుకుని పారిపోతుండగా ఓ పోలీసు కానిస్టేబుల్ తుపాకీతో కాల్చడంతో గాయపడిన ఘటన శుక్రవారం తాలూకాలోని ముస్టూరు గ్రామ సమీపంలో జరిగింది. కొప్పళ జిల్లా ఎస్పీ అరుణ్గిరి కథనం మేరకు ఈనెల 16న బెంగళూరులో ఓ పందుల ఫారంలో ఇద్దరు దుండగులు దోపిడీకి పాల్పడగా, ఫారం యజమాని రామకృష్ణ వారికి అడ్డుపడ్డారు. ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచి ఉడాయించారు. దుండగులు గంగావతి తాలూకాలో సంచరిస్తున్నట్లు తెలియడంతో చిక్కజాల ఎస్ఐ ప్రవీణ్ నేతృత్వంలోని పోలీసు బృందం గంగావతికి చేరుకుంది. దుండగులు ప్రైవేట్ వాహనంలో వెళ్తుండగా వెంబడించి ముస్టూరు సమీపంలో అటకాయించారు. అయితే దుండగులు పోలీసులపై తిరగబడి పరారవ్వడానికి ప్రయత్నించగా కానిస్టేబుల్ బసవరాజ్ వారిపై తుపాకీతో కాల్పులు జరిపారు. శంకర్ సింధనూరు, అశోక్ బెళహట్టిల కాళ్లకు తూటాలు తగిలి తీవ్రంగా గాయపడగా గంగావతి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆస్పత్రి వద్ద డీఎస్పీ రుద్రేశ్ ఉజ్జినకొప్ప గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
దొంగ పారిపోయాడు.. పట్టివ్వండి
బయ్యారం: పోలీస్‌స్టేషన్ నుంచి పారిపోయిన దొంగను పట్టిస్తే రూ.10 వేలు బహుమతి ఇస్తామంటూ బయ్యారం పోలీసుల పేరుతో సోషల్‌మీడియాలో వచ్చిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. గంధంపల్లిలో ఇటీవల పట్టపగలు జరిగిన చోరీపై ఖమ్మం జిల్లా మాదారం గ్రామానికి చెందిన పూనెం రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లో ఉంచారు. ఆదివారం రాత్రి రాజు పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పరారయ్యాడు. పోలీసులు అతడి ఆచూకీ కోసం రహస్యంగా గాలింపు ప్రారంభించారు. తర్వాత రాజును పట్టిస్తే రూ.10 వేల బహుమతి ఇస్తామని ‘బయ్యారం పోలీస్’ పేరుతో ఓ కానిస్టేబుల్‌కు చెందిన మొబైల్ వాట్సాప్ ద్వారా సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీనిపై పోలీస్ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
గాడితప్పుతోంది!
సరిగ్గా నాలుగైదేళ్ల క్రితం ఓ దొంగ జైలు నుంచి వాయిదాలు, అనారోగ్యం పేరుతో బయటికి వచ్చిన సందర్భంలో కొంతమంది ఎస్కార్టు పోలీసులు అతనితో కుమ్మౖక్కై మీకు సగం నాకు సగం తరహాలో వ్యవహరించిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. వాయిదాల పేరుతో ఎస్కార్టు పోలీసుల సమక్షంలో దొంగ బయటికి రావడం, ఏదో ఒక వీధిలో దొంగతనం చేయడం, తెచ్చిన సొమ్మును పంచుకుంటున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్పట్లో కొంతమంది పోలీసులపై వేటు వేశారు. నాలుగేళ్ల క్రితం జిల్లాకు చెందిన ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ను కేసు పనిపై రాజమండ్రికి ఎస్కార్టు పోలీసులు ఓ ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లిన ఘటన అప్పట్లో దుమారం రేపింది. ప్రైవేటు వాహనంలో వెళ్లడంతోపాటు స్మగ్లర్ విలాసాలకు అప్పట్లో కొంతమంది ఎస్కార్టు పోలీసులు సహకరించారని తేలడంతో పోలీసులపై చర్యలు తీసుకున్నారు. 2017లో కడప కేంద్ర కారాగారం నుంచి ముగ్గురు ఖైదీలు పరారయ్యారు. అందులోనూ అంత పెద్ద ప్రహరీని దాటుకుని బయటికి వెళ్లాలంటే ఖచ్చితంగా కొంతమంది పోలీసుల సహకారం ఉందని భావించి జైళ్ల శాఖ పలువురిని సస్పెండ్ చేసింది. ఈ మూడు ఘటనలే కాదు, ఒకరకమైన ఖైదీలు, రిమాండ్ ఖైదీలు బయటికి వెళుతున్న సందర్భంలో పోలీసుల అప్రమత్తత అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రధానంగా నిందితులు బయటి ప్రాంతాలకు (కోర్టు, వాయిదాలు, అనారోగ్య సమస్యలు) వెళుతున్న సమయంలో ఎస్కార్టుగా వెళ్లడానికి కొందరు ఉత్సాహం చూపుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. వీఐపీ నిందితులైతే ఎస్కార్టు సిబ్బందికి పండుగేనని చెప్పక తప్పదు. దీంతో నిందితులు ఎటుపోతున్నా పట్టించుకోని పరిస్థితి ఆందోళన కలిగించే పరిణామం. పైగా ఎస్కార్టు డ్యూటీలకు పలువురు పోటీలు పడుతున్నారనే ప్రచారం ఉంది. సాక్షి, కడప : జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన గజదొంగ, పేరుమోసిన కిడ్నాపర్ సునీల్‌ను ఎస్కార్టు పోలీసులు తప్పించారా? లేక సునీలే పోలీసులను నమ్మకంగా బోల్తాకొట్టించి తెలివిగా తప్పించుకున్నాడా అన్న అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయి. కర్నూలు జిల్లాలోని జలదుర్గం పోలీసుస్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి కర్నూలు పోలీసులు వాయిదా కోసం కోర్టుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే రాయలసీమ ప్రాంతంలో కరుడుగట్టిన నేరాలతో వణుకు పుట్టించిన సునీల్ తప్పించుకోవడంపై అన్నీ అనుమానాలే తలెత్తుతున్నాయి. కర్నూలు నుంచి కడపకు తీసుకొచ్చిన పోలీసులు తిరిగి పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం వరకు వెళ్లడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అక్కడ సునీల్ వ్యక్తిగత పనులు ముగించుకుని తర్వాత పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడా? లేక ఇతర కారణాలతో పోలీసులు తప్పించారా? అన్నది అర్థం కావడం లేదు. నాలుగేళ్ల నుంచి కడప కేంద్ర కారాగారంలో సునీల్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇతనిపై జిల్లాతోపాటు సీమలోని ఇతర జిల్లాల్లో కూడా కేసులు ఉన్నాయి. రెండుసార్లు తప్పించుకున్న సునీల్ జిల్లాలో సునీల్ గ్యాంగ్ ఆరేళ్ల క్రితం హడలెత్తించింది. అప్పట్లో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అనంతరం కేంద్ర కారాగారంలో ఉన్న సునీల్ బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. సునీల్ అనేక నేరాల్లో కీలకపాత్ర పోషించారన్నది బహిరంగ రహస్యం. కిడ్నాప్‌లు చేయడం, బెదిరించడం, హత్యాయత్నం, హత్యల వరకు వెళ్లిన సునీల్ ఎలాగైనా బయటపడాలనే సంకల్పంతో జైలు నుంచే కథ నడిపినట్లుగా తెలుస్తోంది. గతంలో ఒకసారి తప్పించుకున్నప్పటికీ పోలీసులు మేల్కొక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతకముందు కూడా కేంద్ర కారాగారం వద్ద నుంచి తప్పించుకుని పారిపోయారు. అతడు కృష్ణాజిల్లాలో పట్టుబడ్డాడు. ఇప్పుడు మళ్లీ తప్పించుకుని పారిపోయాడు. అప్రమత్తమైన ‘సీమ’ పోలీసులు పెండ్లిమర్రి మండలం నందిమండలం వద్ద గ్యాంగ్‌స్టర్ సునీల్ తప్పించుకున్న వ్యవహారం జిల్లాలో సంచలనం సృష్టించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన పోలీసులు తర్వాత అప్రమత్తమయ్యారు. సీమ జిల్లాల్లో వేట ప్రారంభించారు. అన్నిరకాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నా సునీల్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. జిల్లాలో కడపతో పాటు అన్ని పట్టణాల్లోనూ, చుట్టుపక్కల జిల్లాల్లో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కూడళ్లలో నిఘా పెట్టారు. ఏదీ ఏమైనా సునీల్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. -
జైలుకు తరలిస్తుండగా దొంగ పరార్
-
జైలుకు తరలిస్తుండగా దొంగ పరార్
హైదరాబాద్: అఖీలుద్దీన్ అనే నిందితున్ని పోలీసుకస్టడీ నుంచి చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా పోలీసులపై దాడి చేసి పరారయిన ఈ సంఘటన నగరంలో మంగళవారం జరిగింది. ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్ కేసులో పట్టుబడిన లంబా కేసులో అఖీలుద్దీన్ నిందితుడు. సోమవారం ఎల్బీనగర్ పోలీసులు నిందితున్ని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరి తిరిగి అతన్ని జైలుకు తరలిస్తుండగా ఈఘటన జరిగింది. అఖీల్ బంధువులు రెండు ద్విచక్రవాహనాలపై వచ్చి వెంట ఉన్న పోలీసు కానిస్టేబుల్ శేఖర్, ఉపేందర్‌లపై కారం(పెప్పర్ స్ప్రే) చల్లి అతన్ని తీసికెళ్లినట్లు తెలుస్తోంది. అఖీల్ సోదరుడు షకీల్ కూడా పలు మార్లు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గాయపడిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు చైతన్యపురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
తాళాలున్న ఇళ్లనే టార్గెట్
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్ : పట్టణంలో పెరుగుతున్న చోరీలు ఆందోళన కల్గిస్తున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక ఆర్డీఓ ఇంటి ఎదుట ఉన్న బట్టల దుకాణం షెట్టర్‌ను గడ్డపారతో పెకిలించి చీరలను అపహరించారు. అదేవిధంగా శనివారం తెల్లవారు జామున కొత్త బస్టాండ్ సమీపంలో పార్కింగ్ చేసిన అలంకారణ ైటె ల్స్‌ను డీసీఎం వ్యాన్‌ను కూడా చోరీ చేశారు. రెండేళ్ల క్రితం పట్టణంలోని రావూస్ రెసిడెన్సీలో 35 తులాల బంగారం చోరీకి గురైంది. గతేడాది ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని అపార్ట్మెంట్ నాలుగు ఫ్లాట్లలో ఒకే రోజు వరుస చోరీలు జరిగాయి. రెండు రోజుల క్రితం రావూస్ రెసిడెన్సీలో కొత్త ఏడాది వేడుకలు జరుగుతుండగా మరో వైపు దుండగులు వ్యూహత్మకంగా చోరీలకు పాల్పడ్డారు. ఈ రెసిడెన్సి సమీపంలో ఉన్న భారత్‌నగర్‌లోని అపార్ట్మెంట్, శివాజీ నగర్‌లోని కిరాణ దుకాణాల్లో కూడా అపహరించారు. ఇదిలా ఉండగా.. కొమటి చెరువు సమీపంలో ఇంటి యజమానురాలికి మత్తు మందు ఇచ్చి నిలువు దోపిడీకి పాల్పడ్డారు. పోలీసుల నిఘా వైఫల్యాలు కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. పట్టణం నిద్రపోతున్న వేళ.. సెలవులు, పెళ్లిళ్లకు, శుభ కార్యాలకు వెళ్లినప్పుడు అనివార్యంగా ఇళ్లకు తాళాలు వేయాల్సి వస్తుంది. ఈ విషయాన్ని పసిగడుతున్న చోరులు పకడ్బందీగా వ్యూహ రచన చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అపార్ట్మెంట్లు, భారీ భవనాలకు సీసీ కెమెరాలు లేకపోవడంతో చోరులు ఆచూకీ లభ్యం కావడం లేదు. ఇప్పటికైనా పోలీసులు సీసీ కెమెరాలపై చైతన్యం తేవాల్సి ఉంది. -
లాకప్ నుంచి దొంగ పరారీ
జిల్లా పోలీసుల పరువు మరోసారి మంటకలిసింది. నిత్యం నిఘా నేత్రంలో ఉండే ఏలూరు నగరంలోని పోలీస్ లాకప్ నుంచి అంతర్‌జిల్లాల దొంగ తప్పించుకుని పరారవడం సంచలనం సృష్టించింది. నరసాపురంలో పోలీస్‌స్టేషన్‌కు కన్నం వేసి పారిపోయిన దొంగల విషయాన్ని ప్రజలు మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. ఏలూరు (టూటౌన్), న్యూస్‌లైన్ :ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ లాకప్‌లో ఉన్న అంతర్‌జిల్లాల దొంగ యర్రంశెట్టి రాజేష్ (కుక్కల రాజేష్) అనే నిందితుడు మంగళవారం రాత్రి కిటికీ ఊచలు వంచి పరారవడంతో జిల్లా పోలీసులు ఖంగుతిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 10న యర్రంశెట్టి రాజేష్, షేక్ నాగూర్‌ఖాన్ కలిసి ఏలూరు శాంతినగర్ ఐదో రోడ్డులోని డాక్టర్ వి.అనీల ఇంటిలో 90 కాసుల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. దీనిపై కేసు నమోదైంది. డిసెంబర్ 17న పోలీసులు నాగూర్ఖాన్ను అరెస్ట్ చేసి 30 కాసులను రికవరీ చేశారు. అప్పటి నుంచి రాజేష్ కోసం గాలించారు. మూడు రోజుల క్రితం రాజేష్‌ను పోలీసులు ఏలూరులో అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లోని లాకప్ గదిలో ఉంచారు. ఇతడు ఐపీసీ 299/13 కేసులో నిందితుడిగా నమోదై ఉన్నాడు. అతడిపై జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా అనేక కేసులు ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మంగళవారం రాత్రి పోలీసులు నగరంలో అల్లర్లు జరగకుండా గస్తీ కాస్తున్నారు. త్రీటౌన్ స్టేషన్లో సెంట్రీగా శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన రాజేష్ లాకప్‌లోని కిటికీ ఊచలను వంచి అందులో నుంచి పారిపోయాడు. నిందితుడు పారిపోవడాన్ని చూసిన కానిస్టేబుల్ అతడిని పట్టుకునేందుకు యత్నించినప్పటికీ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. రాజేష్ తప్పించుకోవడం రెండోసారి! యర్రంశెట్టి రాజేష్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2012 లో ఓ దొంగతనం కేసులో రాజేష్, మరో ఇద్దరు దొంగలను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లో వీరిని ఉంచేందుకు స్థలం సరిపోకపోవడంతో వారిని వన్‌టౌన్ స్టేషన్లో ఉంచారు. అదే రోజు రాత్రి బాత్రూమ్లోని కిటీకీ ఊచలను వంచి ముగ్గురు నిందితులూ పారిపోయారు. సీఐ, ఎస్సైల మధ్య విభేదాలే కారణమా? రెండు నెలల నుంచి త్రీటౌన్ సీఐకి, స్థానిక ఎస్సైకి మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 7న విధుల్లో చేరిన సీఐ శ్రీనివాస్‌కు ఎస్సై శ్రీనివాస్‌కు పొసగడం లేదని, అనేక వివాదాలు జరుగుతున్నాయని స్టేషన్‌లోని సిబ్బందే చెబుతున్నారు. రాజేష్ పరారీకి వీరిద్దని నిర్లక్ష్యం కూడా కారణం అయి ఉండవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేషన్ సిబ్బందిపై విచారణ చేపట్టి వారిపై తగిన చర్యలు తీసుకుంటామంటూ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎస్పీ హరికృష్ణ పరిశీలన అంతర్‌జిల్లాల దొంగ పరారైన త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ హరికృష్ణ బుధవారం సాయంత్రం పరిశీలించారు. లాకప్, స్టేషన్ పరిసరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అదే లాకప్‌లో ఉన్న మరో నిందితుడిని ఎస్పీ విచారించారు. అనంతరం సీఐ, ఎస్సైలను విచారిం చారు. ఏఎస్పీ చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ సత్తిబాబు ఆయన వెంట ఉన్నారు.