chain snaching cases
-
లాటరీ పేరుచెప్పి.. ఊరి చివరకు తీసుకెళ్లి.. ఓ మహిళను
ఆదిలాబాద్: లాటరీలో రెండు తులాల బంగారం గెలుచుకున్నావని మాయమాటలు చెప్పి.. ఓ మహిళను ఊరి చివరకు తీసుకెళ్లి ఆమె మెడలోని బంగారు గొలుసు తీసుకుని పారిపోయిన ఘటన నిర్మిల్ జిల్లా కుంటాల మండలం కల్లూర్‌లో శనివారం జరిగింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెంట పెద్దమ్మ ఇంటికి ఒక వ్యక్తి బైక్‌పై వచ్చాడు. పెద్దమ అంటే ఎవరు అని అడిగాడు. అందుకు ఆమె తానేనని చెప్పింది. దీంతో ‘నీవు జియో నెట్వర్క్ నుంచి ఎయిర్‌టెల్‌కు మారావా’ అని అడిగాడు. అవునని పెద్దమ్మ చెప్పడంతో నెట్వర్క్ మారినందుకు లక్కీ లాటరీ తగిలిందని, రెండు తులాల బంగారం గెలుచుకున్నావని చెప్పాడు. దీంతో ఉబ్బి తబ్బిబ్బయిన పెద్దమన్న.. తాను ఏం చేస్తే బంగారం ఇస్తారని అడిగింది. ఏమీ లేదని రూ.10 ఇవ్వాలని చెప్పాడు. ఏమీ ఆలోచించకుండా పెద్దమ్మ ఇంట్లోకి వెళ్లి రూ.10 అడిగితే రూ.110 ఇచ్చింది. రూ.100 సంతోషంగా ఇస్తున్నానని చెప్పింది. దీంతో ఆ డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి.. మెయిన్ రోడ్డు వద్ద ఆఫీసర్లు ఉన్నారని, తనతో వస్తే బంగారం ఇప్పిస్తానని చెప్పాడు. అందుకు సరే అన్న పెద్దమ్మ.. సదరు వ్యక్తి బైక్‌పై వెళ్లింది. సదరు వ్యక్తి ఊరి చివరన ఉన్న 61 నంబర్ జాతీయ రహదారి వద్ద వాసవీ కళాశాల వరకు తీసుకెళ్లాడు. అక్కడ బైక్ ఆపి.. సమీపంలోని బైక్షోరూంలోకి వెళ్లాడు. కాసేపటికి వచ్చి.. పెద్దమను ఆమె మెడలో ఉన్న రెండు తులాల గొలుసు ఇవ్వమని అడిగాడు. వెంటనే ఆమె గొలుసు ఇచ్చింది. ఇక్కడే ఉండమని, గొలుసు తూకం వేసుకుని బంగారం తీసుకువస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపైనా సదరు వ్యక్తి రాకపోవడంతో పెద్దమ్మ షోరూంలోకి వెళ్లి అడిగింది. వారు అతనెవరో తమకు తెలియదని చెప్పడంతో మోసపోయానని గ్రహించింది. వెంటనే విలపిస్తూ కుంటాల పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నిందితుడు బైక్ మహిళను బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు దర్యాప్తు చేస్తున్న ఎస్సై హన్మాండ్లు తెలిపారు. -
చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ చేస్తే.. నకీలీ కరెన్సీ వ్యవహారం గుట్టు రట్టు
సాక్షి హైదరాబాద్: అద్దెకు ఉంటామనే నెపంతో ఇంట్లోకి దూరి మహిళల మెడలోని బంగారు నగలతో ఉడాయిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నగల రికవరీ నిమిత్తం ప్రధాన సూత్రధారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. రూ.40 వేల నకిలీ కరెన్సీ దొరకడంతో పోలీసులకు అనుమానమొచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు రాచకొండ పోలీసులు చెక్ పెట్టారు. మొత్తం 11 మంది గ్యాంగ్‌లో 9 మందిని అరెస్ట్ చేశారు. గురువారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. అక్కడ దొరికి.. నగరానికి వచ్చి.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన కొవ్వూరు శ్రీనివాస్ రెడ్డి గతంలో దొంగనోట్లు ముద్రించి అనపర్తి, రాజమండ్రిలలో చెలామణి చేసేవాడు. అదే గ్రామానికి చెందిన ఓగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి.. దొంగ నోట్లు ఎలా తయారు చేయాలో శ్రీనివాస్ రెడ్డి వద్ద నేర్చుకున్నాడు. స్థానికంగా నకిలీ కరెన్సీ నోట్ల వినియోగిస్తూ ప్రజలను మోసం చేసేవాడు. ఈ కేసులో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చాక ఏపీలో ఉంటే మళ్లీ పట్టుబడతామని గ్రహించి.. తన స్నేహితులైన అనపర్తికి చెందిన కోడూరి శివ గణేష్, శ్రీకాంత్ రెడ్డి, కర్రి నాగేంద్ర సుధామాధవ రెడ్డి, సోరంపూడి శ్రీనివాస్, పిల్లి రామకృష్ణ, పేరం వెంకట శేషయ్య, నాగిరెడ్డి, మస్తాన్‌లతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రూ.50 వేలు ఇస్తే రూ.లక్ష.. మియాపూర్ కల్వరీ టెంపుల్ సమీపంలోని శిల్పా అవెన్యూ కాలనీకి చెందిన తోట సంతోష్ కుమార్ ఇంట్లో దొంగనోట్లు ముద్రించడం మొదలుపెట్టారు. నాగిరెడ్డి, మస్తాన్, శివ గణేష్‌లు నకిలీ రూ.100, 200, 500 దొంగ నోట్ల తయారీదారులు కాగా.. శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుధామాధవ రెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణలు మధ్యవర్తులు. వీరు రూ.50 వేల అసలు నగదు ఇచ్చే వినియోగదారులకు రూ.లక్ష నకిలీ కరెన్సీని ఇస్తుంటారు. ఇందుకు గాను మధ్యవర్తులకు రూ.15వేలు కమీషన్ ఇస్తారు. రూ.35 వేలు తయారీదారులు తీసుకుంటారు. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు గురువారం ఉదయం మార్కెట్లో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. నాగిరెడ్డి, మస్తాన్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.3.22 లక్షల నకిలీ కరెన్సీ, రెండు కలర్ జిరాక్స్ ప్రింటర్లు, వాటర్ మార్క్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జైలులో ఒక్కటయ్యారు.. గతంలో గంజాయి కేసులో సంతోష్ కుమార్ అరెస్ట్ కాగా.. మానవ అక్రమ రవాణా కేసులో పేరం వెంకట శేషయ్య అరెస్ట్ అయ్యాడు. వీళ్లిద్దరికి చర్లపల్లి జైలులో పరిచయం ఏర్పడింది. బెయిల్‌పై బయటికి వచ్చాక దొంగనోట్ల కేసులో ప్రధాన సూత్రధారి అనపర్తికి చెందిన ఓగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డితో జట్టుకట్టారు. మియాపూర్‌లోని సంతోష్ ఇంట్లో దొంగనోట్లు ముద్రించి స్థానికంగా చెలామణి చేయడం మొదలుపెట్టారు -
జల్సాల కోసం దోపిడీలు
నిజామాబాద్ సిటీ: జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు యువకులు దుండగులుగా మారారు. రైలులో ప్రయాణికులను దోచుకుంటూ వచ్చిన సొత్తుతో జల్సాలకు అలవాటు పడ్డారు. చోరీలు చేస్తూ పోలీసుల చేతికి చిక్కి జైలుకు వెళ్లారు. జైలులో ముగ్గురు పరిచయమై ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతూ వచ్చారు. చోరీ సొత్తు విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యారు. చోరీ సంఘటలకు సంబంధించి శుక్రవారం రైల్వే ఎస్పీ జీ. అశోక్‌కుమార్ నిజామాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్ రూరల్ రైల్వే డీఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి విలేకరులతో వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్కు చెందిన బనావత్ నరేష్, మేడ్చల్ జిల్లా కేంద్రంలోని ఏకలవ్య కాలనీకి చెందిన సంతోష్‌కుమార్, సికింద్రాబాద్‌లోని లాలాగూడకు చెందిన గౌరికిషోర్ శాశంక్ వేర్వేరు చోరీల ఘటనలో శిక్షపడి జైలుకు వెళ్లారు. అక్కడ వారు స్నేహితులయ్యారు. గత ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదలైన ఈ ముగ్గురు వరుస చోరీలకు ప్రణాళికలు రచించుకున్నారు. రైలులో మహిళ ప్రయాణికులను దోచుకునేందుకు నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి రైలులో కిటికీల పక్కన కూర్చుని నిద్రపోయే మహిళలను, బాత్రూంకు వెళ్లే ప్రయాణికుల వస్తువులను చోరీ చేసేవారని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. నర్సాపూర్–నాగర్సోల్ రైలులో గత సెప్టెంబర్ 6న చిత్తూర్ జిల్లాకు చెందిన ఉటుకూరి గౌరి అనే మహిళ మెడలో నుంచి 9 తులాల బంగారు గొలుసులు, అక్టోబర్ 29న కృష్ణ జిల్లాకు చెందిన అక్కినేని ఉమాదేవి మెడలో నుంచి 5 తులాల గొలుసు, వివిధ రైలులో ఆగష్టు 31న కడం మారుతిరావు అనే ప్రయాణికుడి నుంచి రూ.35వేల నగదు, నవంబర్ 6న కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన పెరుమండ్ల లావణ్య నుంచి రూ.10వేలు, 19న మిర్జా షాహిద్ నుంచి రూ.1500, మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన హసీనాభాన్ నుంచి రూ. 2800లను చోరీ చేశారు. మొత్తం వీటి విలువ రూ.4.25లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. రైలులో తరుచూ చోరీలపై ఫిర్యాదులు రావటంతో వీటిపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా దుండగులపై నిఘా పెట్టారు. దుండగులు చోరీ చేసేందుకు నిజామాబాద్ రైల్వేస్టేషన్లో తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి వారిని పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి 14 తులాల బంగారు గొలుసులు, రూ.11 వేలు నగదు, ఒక ట్యాబ్, 12 సెల్ఫోన్లు రికవరీ చేశామన్నారు. నిందితులలో నరేష్‌పై 10 కేసులు నమోదు కాగా, మూడుసార్లు జైలుకు వెళ్లివచ్చాడని, సంతోష్‌కుమార్‌పై మూడు కేసులు, శశాంక్‌పై రెండు కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. చోరీలను ఛేదించిన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లకు రివార్డులు ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో సికింద్రాబాద్ సర్కిల్ సీఐ ఎం.వెంకట్రాం నాయక్, నిజామాబాద్ రైల్వే ఎస్ఐ ప్రణయ్‌కుమార్, కామారెడ్డి ఎస్ఐ తావునాయక్, ఆర్పీఎఫ్ సీఐ సరోజ్‌కుమార్, కానిస్టేబుళ్లు సీహెచ్ గురుదాస్, ఎండీ ఆరీఫుద్దీన్, టి. మహేందర్ ఉన్నారు. -
ప్రాణాలు పోయినా పర్వాలేదు
సాక్షి, చెన్నై : చెయిన్ స్నాచర్లు రాను రాను రెచ్చిపోతున్నారు. ప్రాణాలు పోయిన ఫర్వాలేదనుకుని ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే చెన్నై నగర పరిధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోగా.. ఆ వీడియోలు వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతుండటం స్థానికుల్లో భయాందోళలకు గురిచేస్తోంది. అరుమ్‌బాక్కమ్ జరిగిన షాకింగ్ ఘటనలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు మహిళ(52) మెడలోని గొలుసు లాక్కునేందుకు యత్నించారు. అయితే అది ఎంతకు రాకపోవటంతో ఆమె కిందపడిపోయింది ఈ క్రమంలో ఆమెను 50 మీటర్లపాటు అలాగే ముందుకు లాక్కునిపోయారు. బాధితురాలిని ఓల్డ్ వాషర్‌మెన్‌పేట్‌కు చెందిన మేనకగా గుర్తించారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగానే గాయపడినట్లు సమాచారం. మరో ఘటనలో కున్రతూర్‌కు చెందిన 57 ఏళ్ల జయశ్రీ తన భర్తతో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ దొంగ ఆమెపై పడి ఏడు తులాల బంగారు గోలుసును లాక్కునిపోయాడు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ముందుగా వారిపై ఓ కన్నేశారు. తర్వాత వారిలో ఒకడు ఆమె వద్దకు వెళ్లి గొలుసు లాగాడు. ఈ క్రమంలో ఆమె కిందపడి గాయపడగా.. దొంగను పట్టుకునేందుకు భర్త చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. మహిళలు, ముఖ్యంగా వృద్ధులు బయటకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. -
ప్రాణాలు పోయినా పర్వాలేదు
-
అమెరికాలోనూ మనోళ్లే టార్గెట్
చైన్ స్నాచర్ల బారిన పడుతున్న భారత మహిళలు సాక్షి, హైదరాబాద్: ఇక్కడే కాదు... అమెరికాలోనూ చైన్ స్నాచర్ల టార్గెట్ భారత మహిళలేనట! మూడు నెలల్లో అక్కడ మొత్తం 13 చైన్ స్నాచింగ్ కేసులు నమోదైతే అందులో 11 మంది భారత సంతతికి చెందిన మహిళలే బాధితులు. అమెరికాలోని ఫ్రీమాంట్ పోలీసు విభాగ అధికారిణి జెనీవా బొస్క్వస్ ఇటీవల ఈ వివరాలు వెల్లడించారు. షాపింగ్ ప్రాంతాలతో పాటు నివాస సముదాయ పరిసరాల్లో నడుచుకొంటూ వెళుతన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని గొలుసుల చోరీలకు తెగబడుతున్నారన్నారు. బాధితుల్లో ఎక్కువగా ఇండో-అమెరికన్ మహిళలే ఉన్నారన్నారు. ‘బరువైన’ నగలపై గురి... భారత సంస్కృతి ప్రతింబింబించేలా ఇండో-అమెరికన్ మహిళలు అధిక బరువుండే బంగారు గొలుసులు ధరించేందుకు ఇష్టపడుతున్నారు. వీటి విలువ మార్కెట్లో 300 నుంచి 3,000 డాలర్లు ఉంటోంది. దీంతో వీటిపై చైన్ స్నాచర్లు కన్నేశారు. ఇలాంటి మహిళలనే టార్గెట్ చేసి కొట్టేసిన నగలను గుర్తింపునడగని షాపుల్లో సులువుగా అమ్మేస్తున్నారు. ఫ్రీమాంట్ హబ్ షాపింగ్ ప్రాంతంలో నడుచుకొంటూ వెళుతుండగా బైక్‌పై వచ్చిన దుండగులు తన మెడలోని గొలుసు లాక్కెళ్లారని ఓ భారత సంతతి మహిళ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్దకు వచ్చిన ఆఫ్రికన్ మెడలో గొలుసు తెంపుకొని వెళ్లాడనేది మరో మహిళ ఫిర్యాదు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలను దుస్తుల లోపల ధరించాలని బొస్క్వస్ సూచిస్తున్నారు. -
జైలుకు తరలిస్తుండగా దొంగ పరార్
-
జైలుకు తరలిస్తుండగా దొంగ పరార్
హైదరాబాద్: అఖీలుద్దీన్ అనే నిందితున్ని పోలీసుకస్టడీ నుంచి చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా పోలీసులపై దాడి చేసి పరారయిన ఈ సంఘటన నగరంలో మంగళవారం జరిగింది. ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్ కేసులో పట్టుబడిన లంబా కేసులో అఖీలుద్దీన్ నిందితుడు. సోమవారం ఎల్బీనగర్ పోలీసులు నిందితున్ని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరి తిరిగి అతన్ని జైలుకు తరలిస్తుండగా ఈఘటన జరిగింది. అఖీల్ బంధువులు రెండు ద్విచక్రవాహనాలపై వచ్చి వెంట ఉన్న పోలీసు కానిస్టేబుల్ శేఖర్, ఉపేందర్‌లపై కారం(పెప్పర్ స్ప్రే) చల్లి అతన్ని తీసికెళ్లినట్లు తెలుస్తోంది. అఖీల్ సోదరుడు షకీల్ కూడా పలు మార్లు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గాయపడిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు చైతన్యపురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.