కిడ్నీ నుంచి బయటకు తీసిన రాళ్లు
సాక్షి, నంద్యాల అర్బన్: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని శాంతిరాం ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది. పట్టణానికి చెందిన సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ భార్గవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జనార్దన్ అనే వ్యక్తి కిడ్నీలో ఉన్న దాదాపు వెయ్యిరాళ్లను బయటకు తీశారు. అనట్రోఫిక్ నెఫ్రో విథాటమి అనే ఈ శస్త్రచికిత్సను 3గంటల పాటు నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌ను విజవంతంగా నిర్వహించిన డాక్టర్లను ఆసుపత్రి చైర్మన్ మిద్దె శాంతిరాముడు, వైస్ చైర్మన్ డాక్టర్ మాధవీలత అభినందించారు. కార్యక్రమంలో సహ యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్, హౌస్ సర్జన్ హరి, మత్తు డాక్టర్లు మధుసూదన్‌రెడ్డి, నలిని, స్టాఫ్‌నర్సు ఏంజల్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment