బేతంచెర్ల(కర్నూలు): ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పేలుడు సామగ్రిని మంగళవారం బేతంచెర్ల పోలీసులు పట్టుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కర్నూలు నుంచి సంజామల మండలం నొస్సం గ్రామానికి పేలుడు సామగ్రి తరలుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో బేతంచెర్ల వద్ద టాటాసుమోలో తరలిస్తున్న 5000 ఎలక్ట్రానిక్ డిటొనేటర్లు, ఐడీఎల్ పవర్‌జల్ 1249, 500 కేజీల అమ్మోనియా నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు నల్లగొండ జిల్లాకు చెందిన వరి కొప్పుల లింగయ్య, కల్లూరు మండలానికి చెందిన ఐతే శ్రీనివాసులు, కర్నూలులోని బళ్లారి చెందిన అందె సత్యాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.