రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి | Three killed in road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

Published Sun, Nov 10 2013 1:08 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Three killed in road accidents

 జిల్లాలో శనివారం జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మరణించగా, ఒకరికి గాయాలయ్యాయి. విజయవాడ శివారు గుంటుపల్లి ఖాజీపేట, వీరులపాడు మండలం పెద్దాపురం వద్ద, నూజివీడులో ఈ ఘటనలు జరిగాయి. మృతుల్లో ఒకరు గుంటూరు వాసి. మరొకరు గూడెం మాధవరానికి చెందిన రైతు. ఇంకొకరు నూజివీడు పట్టణానికి చెందిన వృద్ధుడు.

 ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : గుంటుపల్లి ఖాజీపేట సమీపంలో శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘట నలో మృతుడు, క్షతగాత్రుడు ఇద్దరూ గుంటూరు జిల్లా వాసులే. వివరాలిలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన మినీ ట్రక్ కూరగాయల లోడుతో ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి బయలుదేరింది. గుంటుపల్లి ఖాజీపేట వద్ద కు వచ్చేసరికి టైర్‌పంక్చర్ అయింది. దీంతో డ్రైవర్, క్లీనర్ టైరు మార్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కూల్‌డ్రింక్ సీసాల లోడుతో వెళుతున్న ట్రాలీ లారీ మినీ ట్రక్కును ఢీకొట్టింది.

 

ట్రాలీ లారీ మీద పడిపోవడంతో మినీ ట్ర క్కులో ఉన్న కంచర్ల మాల్యాద్రి(35), క్లీనర్ రంగిశెట్టి శ్రీనివాసరావు(20) తీవ్రంగా గాయపడ్డారు. సమాచా రం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి స్థా నికుల సాయంతో ఇద్దరినీ బయటకు తీశారు. వారిని 108లో విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మాల్యా ద్రి మార్గమధ్యంలో చనిపోయాడు. దీంతో మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుంటూరు నగరానికి చెందిన ఇతడు కూరగాయల వ్యాపారిగా భావిస్తున్నారు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. గాయపడిన శ్రీనివాసరావు సత్తెనపల్లి వాసి. ఘటనాస్థలిని ఎస్సైలు రామారావు, వాసిరెడ్డి శ్రీను పరిశీలించి, వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన ట్రాలీ లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. ట్రక్ డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడంతో ఈ  ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నా రు. ఈ ప్రమాదంలో మినీ ట్రక్ డ్రైవర్‌కు గాయాలు కాలేదు. ఈ ఘటనపై కేసు నమోదవగా, సీఐ కనకారావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.


 వేరొక ఘటనలో మరొకరు..


 కంచికచర్ల రూరల్ : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వీరులపాడు మండలంలో శనివారం చోటు చేసుకుం ది. వీరులపాడు ఏఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గూడెం మాధవరానికి చెం దిన రైతు ఇమ్మడి నరసింహారావు(43) ఖమ్మం జిల్లా ఎర్రుపాలేనికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. పెద్దాపురం గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఎర్రుపాలెం నుంచి కంచికచర్ల వైపు వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు ఇతడి బైక్‌ను ఎదురుగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో నరసింహారావు తలకు బలమైన గాయమైంది. స్థానికులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా, నరసింహారావు అప్పటికే చనిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి మృతదేహాన్ని నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి తన వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. ఈ వాహనదారుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశామని ఏఎస్సై తెలిపారు. ప్రమాదం గురించి తెలిసి నరసింహారావు బంధువులు, స్థానికులు ఘటనాస్థలికి వచ్చారు. అతడి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనతో గూడెం మాధవరంలో విషాదం నెలకొంది.
 

ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని సైక్లిస్ట్..


 నూజివీడు : పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం.. స్థానిక కొత్తపేటకు చెందిన మేకల వీరవెంకయ్య(65) శనివారం సాయంత్రం సత్యనారాయణ థియేటర్ వైపు నుంచి జంక్షన్‌రోడ్డుకు సైకిల్‌పై వస్తున్నాడు. సిద్ధార్థ కళాశాల సమీపంలో చింతలపూడి నుంచి వస్తున్న నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దెబస్సు సైకిల్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరవెంకయ్య అక్కడికక్కడే మరణించా డు. ఈ ఘటనపై ఎస్సై నాగేంద్రకుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement