అక్టోబర్, నవంబర్‌లో మూడు తుపాన్లు
అక్టోబర్, నవంబర్‌లో మూడు తుపాన్లు
Published Tue, Sep 19 2017 2:21 AM | Last Updated on Sat, Jul 28 2018 3:41 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: అక్టోబర్ 3వ వారం నుంచి నవంబర్ తొలి వారం మధ్య మూడు తుపాన్లు వచ్చే ప్రమాదం ఉందని ఇస్రో నిపుణులు వెల్లడించారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తుపాన్ల సమాచారం ముందే అంచనా వేసి పంట దిగుబడులు కాపాడుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు. నీరు–ప్రగతి, వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతిపై సీఎం సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
నవంబర్‌లో కాఫర్ డ్యాం పనులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పోలవరం: పోలవరం కాఫర్ డ్యాం పనులు ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పవర్‌హౌస్ నిర్మాణానికి కూడా త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.
Advertisement
Advertisement