బనగానిపల్లె:కర్నూలు జిల్లా బనగానిపల్లె సమీపంలో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత దారి దోపిడీ జరిగింది. అనంతపురంలోని కర్ణాటక బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ జె.లక్ష్మీనారాయణ అనంతపురం నుంచి మహానంది పట్టణానికి కారులో వెళ్తున్నారు. బనగానిపల్లె మండలం రాళ్లకొత్తూరు సమీపంలో గుర్తు తెలియని దుండగులు రోడ్డుకు అడ్డంగా రాళ్లు, దుంగలు ఉంచి ఆయన కారును ఆపారు. లక్ష్మీనారాయణను బెదిరించి రూ.38 వేల నగదు, బంగారు చైన్‌ను లాక్కున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.