వార్తా తరంగిణి | Today News Roundup 8th June | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు

Published Fri, Jun 8 2018 5:40 PM | Last Updated on Fri, Jun 8 2018 6:34 PM

Today News Roundup 8th June - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌​ పార్టీ శుక్రవారం ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. టీడీపీ సర్కార్‌లో అభివృద్ధి శూన్యమని, అందువల్లే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేస్తున్నామని వైఎస్సార్‌​సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందే తప్ప, అంగుళం కూడా అభివృద్ధి లేదు. 

నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్సార్‌ సీపీ ఛార్జ్‌షీట్‌
సాక్షి, హైదరాబాద్‌ : నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌​ పార్టీ శుక్రవారం ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. 

జగన్‌-దీక్షితులు భేటీ; ఆపరేషన్‌ గరుడా?
సాక్షి, హైదరాబాద్‌: జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు కలుసుకోవడంపై చవాకులు పేలుతున్నవారికి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు ఘాటుగా బదులిచ్చారు.

చంద్రబాబు 36 సార్లు మాటమార్చారు : పవన్‌
సాక్షి, పాయకరావుపేట : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై 36 సార్లు మాట మార్చారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌​అన్నారు.

‘అలా జరిగితే, కచ్చితంగా వైఎస్‌ జగనే సీఎం’
సాక్షి, గుంటూరు : రాజీనామా అనే పదం చాలా చిన్నది కానీ, దాని పర్యవసానం చాలా పెద్దదని వైఎస్సార్‌ సీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు.

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ ముఖ్యనేత
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

‘కేసీఆర్‌ వైఖరిపై మళ్లీ కోర్టు కెళతాం’
సాక్షి, హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు.

సల్మాన్‌ ఖాన్‌ను కలిసిన కేంద్ర మంత్రి
సాక్షి, ముంబై : ‘సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌’  ప్రచారంలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, ఆయన తండ్రి సలీం ఖాన్‌ను కలిశారు.

రాజీవ్‌ తరహాలోనే మోదీ హత్యకు భారీ కుట్ర!
పుణే : ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర జరిగిందని, గతేడాది నుంచే ఆయన హత్యకు మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడైంది.

ట్రంప్‌ కాక్‌టెయిల్‌, కిమ్‌ వోడ్కా
సింగపూర్‌ : ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా- ఉత్తరకొరియా దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ భేటి సింగపూర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.

ఎయిర్‌ ఇండియాకు పైలెట్ల షాక్‌
సాక్షి, న్యూఢిల్లీ  : నష్టాలతో సతమతమవుతున్న జాతీయ ఎయిర్‌లైనర్‌ ఎయిర్‌ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

అద్భుత ఫీచర్లతో బ్లాక్‌బెర్రీ కీ2
న్యూయార్క్‌: బ్లాక్‌బెర్రీ మరో సరికొత్త ఫోన్‌తో బ్లాక్‌బెర్రీ అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

ఆ బుడ్డోడిని కిడ్నాప్‌ చేస్తా : సమంత
రంగస్థలం సినిమా ఎంత హిట్టయిందో అందులోని పాటలు కూడా అంతే హిట్టయ్యాయి

నాగినీ డ్యాన్స్‌ : జస్ట్‌ సీన్‌ మారిందంతే!
డెహ్రాడూన్‌: మైదానంలో మళ్లీ నాగినీ డ్యాన్స్‌.. జస్ట్‌ సీన్‌ మారింది అంతే.. 

గర్ల్‌ఫ్రెండ్‌తో సందీప్‌ శర్మ నిశ్చితార్థం!
పాటియాలా: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement