
బడికి వేళాయె!
పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి.. మరికొన్ని గంటల్లో బడిగంటలు మోగనున్నాయి.. ఇన్నాళ్లు ఎంచక్కా ఎంజాయ్ చేసిన చిన్నారులు ఆటపాటలకు టాటాచెప్పి బడిబాట పట్టనున్నారు.
నేడు పాఠశాలల పునఃప్రారంభం
అరకొర సౌకర్యాలతో స్వాగతం
20.60 లక్షల పాఠ్యపుస్తకాలు సిద్ధం
మారిన పదో తరగతి సిలబస్
పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి.. మరికొన్ని గంటల్లో బడిగంటలు మోగనున్నాయి.. ఇన్నాళ్లు ఎంచక్కా ఎంజాయ్ చేసిన చిన్నారులు ఆటపాటలకు టాటాచెప్పి బడిబాట పట్టనున్నారు. జిల్లాలో 3,300 ప్రభుత్వ, 1200 ప్రైవేటు పాఠశాలలు గురువారం
ప్రారంభం కానున్నాయి. కొత్త పుస్తకాలు.. కొత్త బ్యాగులు.. కొత్త యూనిఫారాలు.. కొత్త స్నేహితులతో పిల్లల సంబరం.. వారిని పొద్దున్నే బడికి రెడీచేసి పంపడంలో తల్లిదండ్రుల హడావుడి.. ఇలాంటి బిజీబిజీ సన్నివేశాలు ప్రతి ఇంటా మళ్లీ కనిపిస్తాయి.
వేసవి సెలవుల అనంతరం నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచిప్రారంభం కానున్నాయి. సుమారు 40 రోజులపాటు ఆటపాటలతో కాలక్షేపం చేసిన చిన్నారులంతా బడిబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫారాలను సిద్ధం చేసుకున్న విద్యార్థులు కొత్త బ్యాగులతో స్కూళ్లల్లో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చిన్నారులకు పాఠ్య పుస్తకాలు, బూట్లు, బ్యాగులు, యూనిఫారాల కొనుగోళ్లతో గత వారం రోజులుగా తల్లిదండ్రులు బిజీగా గడిపారు. నగరవ్యాప్తంగా 7.5 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సుమారు 50 వేల మంది చిన్నారులు తొలిసారిగా బడుల్లోకి అడుగుపెడుతున్నారు. నూతన విద్యా సంవత్సరంలో కోటి ఆశలు, శతకోటి ఠమొదటిపేజీ తరువాయి
ఆకాంక్షలతో బడిలో అడుగు పెడుతున్న చిన్నారులకు ఆల్ ది బెస్ట్.
ముస్తాబైన స్కూళ్లు..
పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న వేళ నగరంలో ప్రత్యేక వాతావరణం చోటుచేసుకుంది. షాపులన్నీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కళకళలాడుతున్నాయి. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించేం దుకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లన్నీ ఇప్పటికే (తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం) అలంకరించాయి. సర్కారు స్కూళ్లు మాత్రం పాత సమస్యలతోనే స్వాగతం పలుకనున్నాయి.పెరిగిన పుస్తకాల ధరలు
పేపర్ ధర పెరిగిన దృష్ట్యా ఈ ఏడాది అన్ని రకాల పుస్తకాల ధరలు 5 నుంచి 10 శాతం పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వమే ఉచితంగానే పంపిణీ చేస్తుండగా, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పుస్తకాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతేకాదు పలు ప్రైవేటు స్కూళ ్లలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులందరూ పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు తమ వద్దే కొనాలని యాజమాన్యాలు షరతులు పెట్టాయి. ఇప్పటికే 95 శాతం మంది విద్యార్థులు తమకు అవసరమైన పుస్తకాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. ఈ ఏడాది కేవలం స్కూల్ విద్యార్థుల వల్ల సాధారణ మార్కెట్ (బ్యాగులు, బూట్లు, యూనిఫారమ్ తదితరాలన్నీ కలిపి)లో దాదాపు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు అంచనా.
మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువు‘కొంటున్నది’ఇలా..
తరగతి ట్యూషన్ ఫీజు ట్రాన్స్‌పోర్ట్ పుస్తకాలు అడ్మిషన్ ఫీజు
నర్సరీ-యూకేజీ 18,000 7,500 2,500 10,000
1,2,3వ తరగతులకు 23,000 10,000 3,000 10,000
4,5వ తరగతులకు 28,000 12,000 3,400 15,000
6,7వ తరగతులకు 33,000 15,000 3,500 20,000
8,9వ తరగతులకు 38,000 15,000 4,000 20,000
10వ తరగతికి 42,000 15,000 4,000 20,000
నోట్: ఇవీకాక యూనిఫారాలు, షూ అండ్ సాక్స్, టై, లోగో, బెల్ట్‌ల ఖర్చు అదనం.