పండుగే పండుగ | Today's celebration of the festival of sakshi | Sakshi
Sakshi News home page

పండుగే పండుగ

Published Tue, Dec 23 2014 12:46 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

పండుగే పండుగ - Sakshi

పండుగే పండుగ

నేటి నుంచి సాక్షి పండుగ సంబరాలు
రోజూ రూ. లక్ష గెలిచే చాన్స్
బంపర్ డ్రాలో నానో కారు
{పత్యేక డ్రాలో 2 బైకులు
15 రోజుల పాటు సంబరాలు


విశాఖపట్నం సిటీ :  వినియోగదారులకు అసలైన పండుగ వచ్చేసింది. లక్షాధికారులను చేయనుంది. మూడేళ్లుగా విశాఖ ప్రజలను లక్షాధికారులను చేస్తున్న సాక్షి పండుగ సంబరాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రోజూ రూ.లక్ష గెలిచే అపూర్వ అవకాశాన్ని సాక్షి విశాఖ ప్రజలకు అందిస్తోంది. ఈ సంబరాలను ఎస్‌ఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో మంగవారం నుంచి  
 జనవరి 6వ  తేదీ వరకూ 15 రోజులపాటు నిర్విరామంగా నిర్వహించనుంది. రోజూ డ్రాలో రూ. లక్ష నగదు బహుమతితో పాటు అయిదు కన్సొలేషన్ బహుమతులు, ఆఖరి రోజున ప్రత్యేక డ్రాలో రెండు బైక్‌లు, బంపర్ డ్రాలో విజేతలైన వారికి టాటా నానో కారు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ సంబరాల్లో దాదాపు 93 మందిని విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు ఇస్తారు. ఈ సంబరాలకు ఎస్‌ఆర్ షాపింగ్ మాల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా అందుకు సపోర్టెడ్‌గా వైభవ్ జ్యూవలర్స్, పవర్డ్ సెల్‌పాయింట్‌తో పాటు కో-స్పాన్సర్స్‌గా గెలాక్సీ, బాయ్‌లండన్, వరుణ్ మారుతి, బీఈ షాపీ, వరుణ్‌బజాజ్, కళ్యాణి ఫ్యామిలీ షాపీ, శ్రీశ్రీనివాసా యమహా, క్రాంతి ప్రాపర్టీస్ వంటి సంస్థలు వ్యవహరిస్తున్నాయి.

ప్రత్యేక డ్రాలో విజేతలైన వారికి శ్రీ శ్రీనివాసా యమహా వారు యమహా ఆల్ఫా బైక్, వరుణ్ బజాజ్ వారు డిస్కవరీ-100 బైక్‌లను అందిస్తున్నారు. బంపర్ ప్రైజ్ గా టాటా నానో కారును శివశంకర మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌ఆర్‌ఎంటీ లిమిటెడ్ వారు అందిస్తున్నారు. అంతే గాక గిఫ్ట్ స్పాన్సర్లుగా టీఎంసీ, బీఈ షాపీ, గాయత్రీ హోం అప్లయెన్సెస్, సెల్‌కాన్ మొబైల్ వారు అందిస్తున్నారు. టీవీ పార్టనర్‌గా సాక్షి టీవీ, రేడియో పార్టనర్‌గా రేడియో మిర్చి వ్యవహరిస్తున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకూ పైన తెలిపిన ఏ షాపులోనైనా కొనుగోలు చేసి పొందిన కూపన్‌ను డ్రా బాక్సులో వేయాలి. ఏ రోజుకారోజు తీసే డ్రాలో గెలుపొంది క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు జరుపుకోవాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 99122 22796, 99122 20550 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement