sponsors
-
కబడ్డీలో అద్భుత ప్రతిభ.. సాయం కోసం ఎదురుచూపు..
చేర్యాల ( సిద్దిపేట ) : మండల పరిధిలోని గుర్జకుంటకు చెందిన శెట్టె నరేశ్ కబడ్డీలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు . ఇటీవల గోవాలో జరిగిన అండర్ -19 విభాగ పోటీల్లో తెలంగాణ జట్టులో తన ప్రతిభ చాటాడు . ప్రస్తుతం చేర్యాలలో ఇంటర్ చదువుతున్న నరేశ్ అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. త్వరలో నేపాల్‌లో జరగబోయే పోటీలకు అతడు సన్నద్ధం అవుతున్నాడు. అయితే , స్పాన్సర్లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు . ఆర్థిక సహకారం అందిస్తే మరింత ప్రతిభతో క్రీడల్లో రాణించి రాష్ట్రనికి , దేశానికి పేరు మంచి తెస్తానంటున్నాడు . అతనికి సహాయం చేయాలనుకుంటున్న వారు మొబైల్ నంబర్ 6303757100 లో సంప్రదించవచ్చు. చదవండి: KL Rahul: ముంబై ఇండియన్స్‌కు ఆడనున్న కేఎల్ రాహుల్! -
రొనాల్డో ఎఫెక్ట్: ఇకపై బాటిల్స్ ముట్టుకుంటే..
క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ కోకా కోలా బాటిల్ వ్యవహారం ఎన్నో పరిణామాలకు దారితీస్తోంది. ప్రెస్ మీట్లో కోక్ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ..’ రొనాల్డ్ ఇచ్చిన పిలుపు.. కోలా బ్రాండ్‌కు ఊహించని స్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే రొనాల్డో చర్య తర్వాత మరికొందరు ఆటగాళ్లు.. అతన్నే అనుకరిస్తూ, అనుసరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ ఫుట్‌బాల్ అసోషియేషన్స్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. ఇకపై ఆటగాళ్లు బాటిళ్లను జరపడం, పక్కనపెట్టడం చాలా చేష్టలకు పాల్పడితే జరిమానా తప్పదని హెచ్చరించింది. కేవలం బాటిళ్లలోనే కాదు.. స్పానర్లుగా వ్యవహరిస్తున్న కంపెనీల ప్రొడక్టుల విషయంలోనూ ఈ హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘టోర్నమెంట్ నిర్వాహణ కోసం ఆయా బ్రాండ్లతో ఒప్పందాలు జరిగాయని ఆటగాళ్లు గమనించాలి. వాళ్ల భాగస్వామ్యంతోనే యూరప్ దేశాల్లో ఫుట్‌బాల్ పురోగతికి కృషి జరుగుతోందని గుర్తించాలి’ అని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది యూఈఎఫ్ఏ. ఇక పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చర్యను పరోక్షంగా తప్పుబట్టిన టోర్నమెంట్ డైరెక్టర్ మార్టిన్ కల్లెన్.. ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా చేసిన పనిని కూడా పరోక్షంగానే సమర్థించాడు. మత విశ్వాసానికి ముడిపడిన అంశం కావడంతో ఆ విషయంలో అతన్ని(పోగ్బా) తప్పుబట్టలేమని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లకు జరిమానా విధించే విషయంలో యూఈఎఫ్ఏ నేరుగా జోక్యం చేసుకోదని, ఆయా ఆటగాళ్ల ఫుట్‌బాల్ ఫెడరేషన్లే చూసుకుంటాయని మార్టిన్ స్పష్టం చేశాడు. చదవండి: ప్లీజ్ ఇలాంటివి వద్దు-రొనాల్డో -
స్పాన్సర్లు కావెలను
-
చైనా ‘ఆట’లు ఆపతరమా..!
ఐపీఎల్‌తో చైనా కంపెనీ ‘వివో’ ఒప్పందాన్ని సమీక్షిస్తామంటూ బీసీసీఐ ప్రత్యేక సమావేశానికి సిద్ధమైంది. ఆ స్పాన్సర్షిప్ విలువ అక్షరాలా రూ. 2,199 కోట్లు!... అవసరమైతే మేం కూడా చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తాం అంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కూడా చెబుతోంది. వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య అయితే ఇప్పటికే చైనా ఎక్విప్మెంట్ను పక్కన పెట్టేసినట్లు ప్రకటించేసింది. సరిహద్దు వివాదం నేపథ్యంలో సహజంగానే మన క్రీడా సంఘాల్లో తమ వైపునుంచి దేశభక్తిని ప్రదర్శించేందుకు ఒకరితో మరొకరు పోటీ పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంనుంచి అధికారికంగా నిషేధం లేకుండా ఇలాంటివి అసలు సాధ్యమేనా... భారత క్రీడా రంగానికి గత కొన్నేళ్లలో చైనాతో ముడిపడిపోయిన బంధాన్ని చూస్తే ‘బాయ్‌కాట్’కు సాహసించడం అంత సులువు కాదు. కేంద్ర వాణిజ్య శాఖ ఎగుమతులు, దిగుమతుల డేటా బ్యాంక్ ప్రకారం 2019 ఏప్రిల్‌నుంచి 2020 ఫిబ్రవరి వరకు భారతదేశంలో ‘జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్, ఇతర అవుట్డోర్ క్రీడలు సహా’ సుమారు రూ. 919 కోట్ల క్రీడా పరికరాలు చైనానుంచి దిగుమతి అయ్యాయి. మొత్తంగా ఆ సమయంలో మనం తెప్పించుకున్న క్రీడా సామగ్రిలో 65 శాతం చైనానుంచే వచ్చింది. ఇంకా చెప్పాలంటే గత ఐదేళ్లలో భారత స్పోర్ట్స్ మార్కెట్లోకి చైనా దిగుమతుల విలువ ఏకంగా 80 శాతం పెరిగింది. ముఖ్యంగా బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫిట్నెస్ ఎక్విప్‌మెంట్‌లలో సింహభాగం చైనాదే. ఇటీవల బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ కూడా ఆ దేశంనుంచే వస్తున్నాయి. ముడి సరుకు మాత్రమే కాకుండా పూర్తయిన క్రీడా సామగ్రి కూడా చైనాదే. ప్రస్తుతం భారత క్రీడల్లో చైనా వస్తువుల ఆధిపత్యం ఏమిటో ఇది చూపిస్తోంది. పుణేకు చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ దీనిపై మాట్లాడుతూ ...‘చైనాకు చెందిన తైషన్ అనే కంపెనీనుంచి మన దేశానికి జిమ్నాస్టిక్స్ ఎక్విప్మెంట్ వస్తుంది. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య గుర్తించిన ప్రమాణాలను పాటిస్తూ రూ. 1 కోటికి అది ఒక సెట్‌ను అందిస్తుంది. అదే జర్మనీనో, ఫ్రెంచో అయితే కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. దానిని ఎవరు భరిస్తారు’ అనడం వాస్తవ స్థితికి అద్దం పడుతోంది. లీ–నింగ్ జోరు... భారత్‌కు సంబంధించి క్రికెటేతర క్రీడల్లో ఇప్పుడు చైనాకు చెందిన లీ–నింగ్దే హవా. మాజీ జిమ్నాస్ట్, 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో 6 పతకాలు సాధించిన ఆ దేశపు దిగ్గజం లీ–నింగ్‌కు చెందిన ఈ కంపెనీ ఒక్కసారిగా దూసుకొచ్చింది. సొంత దేశం తర్వాత వారికి అది పెద్ద మార్కెట్ భారత్‌లో ఉంది. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు పీవీ సింధుతో నాలుగేళ్లకు రూ. 48 కోట్లు, కిడాంబి శ్రీకాంత్‌తో రూ. 35 కోట్ల ఒప్పందాలు చేసుకోవడంతో పాటు ఇతర యువ షట్లర్లను కూడా లీ–నింగ్‌తో తమతో చేర్చుకుంది. భారత బ్యాడ్మింటన్‌పై తమ పైచేయి సాధించేందుకు సిద్ధమైంది. ఇదే క్రమంలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాదికి వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ వరకు అది అమల్లో ఉంటుంది. ప్రపంచపు అతి పెద్ద మెగా ఈవెంట్లో భారత అథ్లెట్లంతా లీ–నింగ్ లోగో ముద్రించిన దుస్తులతోనే పోటీ పడాల్సి ఉంటుంది. మేం కూడా సమీక్షిస్తాŠం అంటూ బయటకు చెబుతున్నా అది సాధ్యం కాదనేది వారికీ తెలుసు. ‘క్రికెటేతర క్రీడలకు స్పాన్సర్లు దొరకడం చాలా కష్టం. లీ–నింగ్ ఎక్కువ మొత్తానికి బిడ్ వేయడంతో వారితో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రభుత్వం కచ్చితమైన మార్గనిర్దేశకాలు జారీ చేస్తే ఏమో గానీ ఒలింపిక్స్‌కు ముందు వారితో ఒప్పందం రద్దు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ అలా చేస్తే ఒప్పంద ఉల్లంఘన కింద ఇవ్వాల్సిన నష్టపరిహారం తట్టుకోలేనంతగా ఉంటుంది’ అని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా కుండ బద్దలు కొట్టారు. అడుగడుగునా చైనా యువాన్లే... మొబైల్స్ ఉత్పత్తుల చైనా కంపెనీ ‘వివో’ ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఏడాదికి రూ. 440 కోట్ల భారీ ఒప్పందంలో బీసీసీఐపై కనకవర్షం కురిసింది. అది అంతకు ముందుకంటే 554 శాతం ఎక్కువ! ప్రొ కబడ్డీ లీగ్‌కు కూడా రూ. 300 కోట్ల విలువతో (ఐదేళ్లకు) వివోనే స్పాన్సర్. 2017లో టీమిండియా ప్రధాన స్పాన్సర్షిప్ కోసం మరో చైనా కంపెనీ ‘ఒప్పో’ రూ. 1079 కోట్లు చెల్లించింది. ఒప్పో అనూహ్యంగా తప్పుకున్న తర్వాత ఆన్లైన్ లెర్నింగ్ కంపెనీ ‘బైజూస్’ ఇప్పుడు కోహ్లి సేనకు ప్రధాన స్పాన్సర్‌గా ఉంది. బైజూస్‌లో కూడా చైనా కంపెనీ ‘టెన్సెంట్’ పెట్టుబడులు ఉన్నాయి. బీసీసీఐతో స్పాన్సర్లుగా అనుబంధం కొనసాగిస్తున్నవాటిలో చైనాతో సంబంధం, నేపథ్యం ఉన్న పేటీఎం, డ్రీమ్ 11, స్విగ్గీ, మేక్ మై ట్రిప్...ఇలా ఈ జాబితా పెద్దదే. ఇలాంటి స్థితిలో భారత కంపెనీలు ముందుకొచ్చి క్రీడా సంఘాలు ఆశించిన మొత్తానికి కోట్లాది రూపాయల స్పాన్సర్షిప్ ఇవ్వడం దాదాపుగా అసాధ్యం. ‘ఎక్కడో ఒక చోట పెట్టక తప్పదు కాబట్టి ఆయా సంస్థల నేపథ్యం ఏ దేశందైనా ఉండవచ్చు. కానీ ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీలు. వాటికి జాతీయత ఆపాదించడం సరైంది కాదు’ అంటూ ప్రముఖ స్పోర్ట్స్ లాయర్ నందన్ కామన్ చేసిన వ్యాఖ్యను చూస్తే తాజా పరిస్థితుల్లో చైనా లేకుండా మన ఆటలు కష్టమేమో! -
బుకర్ ప్రైజ్’కు మ్యాన్ గ్రూప్ గుడ్‌బై
లండన్: ఆంగ్ల నవలారంగంలో బ్రిటన్ అందించే అత్యున్నత పురస్కారం ‘మ్యాన్ బుకర్ ప్రైజ్’ పేరు మారనుంది. బుకర్ ప్రైజ్‌కు 18 ఏళ్లుగా స్పాన్సర్ కొనసాగుతున్న హెడ్జ్ సంస్థ ‘మ్యాన్ గ్రూప్’ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. అత్యుత్తమ ఆంగ్ల నవలలకు ఏటా ఈ అవార్డు కింద 50వేల బ్రిటిష్ పౌండ్లు(రూ.46.79 లక్షలు) బహుమతిగా అందజేస్తున్నారు. బ్రిటన్ రచయిత సెబాస్టియన్ ఫాల్క్స్ గతేడాది మ్యాన్ గ్రూప్‌ను ప్రజలకు శత్రువుగా అభివర్ణించారు. అంతేకాకుండా కామన్వెల్త్ దేశాల రచయితలకే పరిమితమైన ఈ అవార్డును 2014లో మిగిలిన దేశాలకు విస్తరించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పాన్సర్ బాధ్యతల నుంచి తప్పుకోవా లని నిర్ణయించింది. దీనివల్ల ఏటా రూ.14.97 కోట్ల ఆర్థిక సాయాన్ని బుకర్ సంస్థ కోల్పోనుంది. 1969 నుంచి 2002 వరకూ బుకర్ అవార్డుకు మెక్‌కెన్నెల్ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అప్పట్లో 21 వేల పౌండ్లుగా ఉన్న బహుమతిని 2002లో మ్యాన్ గ్రూప్ 50 వేల పౌండ్లకు పెంచింది. -
పండుగే పండుగ
నేటి నుంచి సాక్షి పండుగ సంబరాలు రోజూ రూ. లక్ష గెలిచే చాన్స్ బంపర్ డ్రాలో నానో కారు {పత్యేక డ్రాలో 2 బైకులు 15 రోజుల పాటు సంబరాలు విశాఖపట్నం సిటీ : వినియోగదారులకు అసలైన పండుగ వచ్చేసింది. లక్షాధికారులను చేయనుంది. మూడేళ్లుగా విశాఖ ప్రజలను లక్షాధికారులను చేస్తున్న సాక్షి పండుగ సంబరాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రోజూ రూ.లక్ష గెలిచే అపూర్వ అవకాశాన్ని సాక్షి విశాఖ ప్రజలకు అందిస్తోంది. ఈ సంబరాలను ఎస్ఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో మంగవారం నుంచి జనవరి 6వ తేదీ వరకూ 15 రోజులపాటు నిర్విరామంగా నిర్వహించనుంది. రోజూ డ్రాలో రూ. లక్ష నగదు బహుమతితో పాటు అయిదు కన్సొలేషన్ బహుమతులు, ఆఖరి రోజున ప్రత్యేక డ్రాలో రెండు బైక్‌లు, బంపర్ డ్రాలో విజేతలైన వారికి టాటా నానో కారు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ సంబరాల్లో దాదాపు 93 మందిని విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు ఇస్తారు. ఈ సంబరాలకు ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా అందుకు సపోర్టెడ్‌గా వైభవ్ జ్యూవలర్స్, పవర్డ్ సెల్‌పాయింట్‌తో పాటు కో-స్పాన్సర్స్‌గా గెలాక్సీ, బాయ్‌లండన్, వరుణ్ మారుతి, బీఈ షాపీ, వరుణ్‌బజాజ్, కళ్యాణి ఫ్యామిలీ షాపీ, శ్రీశ్రీనివాసా యమహా, క్రాంతి ప్రాపర్టీస్ వంటి సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్రత్యేక డ్రాలో విజేతలైన వారికి శ్రీ శ్రీనివాసా యమహా వారు యమహా ఆల్ఫా బైక్, వరుణ్ బజాజ్ వారు డిస్కవరీ-100 బైక్‌లను అందిస్తున్నారు. బంపర్ ప్రైజ్ గా టాటా నానో కారును శివశంకర మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఆర్ఎంటీ లిమిటెడ్ వారు అందిస్తున్నారు. అంతే గాక గిఫ్ట్ స్పాన్సర్లుగా టీఎంసీ, బీఈ షాపీ, గాయత్రీ హోం అప్లయెన్సెస్, సెల్కాన్ మొబైల్ వారు అందిస్తున్నారు. టీవీ పార్టనర్‌గా సాక్షి టీవీ, రేడియో పార్టనర్‌గా రేడియో మిర్చి వ్యవహరిస్తున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకూ పైన తెలిపిన ఏ షాపులోనైనా కొనుగోలు చేసి పొందిన కూపన్‌ను డ్రా బాక్సులో వేయాలి. ఏ రోజుకారోజు తీసే డ్రాలో గెలుపొంది క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు జరుపుకోవాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 99122 22796, 99122 20550 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు. -
కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి
మై క్యాంపస్ లైఫ్- ఐఐటీ - ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటి. ఇంజనీరింగ్ కోర్సుల్లో అత్యుత్తమ బోధన, పరిశోధనలకు పెట్టింది పేరు. ఇటీవల క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ జాబితాలో ప్రపంచంలోనే 235వ స్థానంలో నిలిచింది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న చలమలశెట్టి యువ నాగ సాయి అవినాశ్ కార్తీక్ తన క్యాంపస్ లైఫ్ విశేషాలను, ప్రత్యేకతలను వివరిస్తున్నారిలా.. మాది హైదరాబాద్. విద్యానగర్‌లో ఉంటాం. నాన్న నాగోల్‌లో టీవీఎస్ షోరూమ్‌ను నిర్వహిస్తున్నారు. అమ్మ గృహిణి. అక్క యూఎస్‌లోని రైట్ స్టేట్ యూనివర్సిటీ - ఒహియోలో ఎంఎస్ చేస్తోంది. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే విద్యనభ్యసించాను. పదో తరగతిలో 557 మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 979 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయిలో 389, అడ్వాన్స్‌డ్‌లో 69, బీఆర్క్‌లో 14వ ర్యాంకులు వచ్చాయి. కమిటీ పరిశీలిస్తుంటుంది ప్రవేశం లభించిన వారందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. ఒక్కో రూమ్‌కు ముగ్గురు చొప్పున ఉంటారు. రూమ్‌లో స్టడీ టేబుల్, బెడ్, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ప్రతి హాస్టల్‌కు కామన్రూమ్లో భాగంగా పత్రికలు, మ్యాగజైన్లు, టీవీ ఉంటాయి. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. ఒక కమిటీ క్యాంపస్ అంతా తిరుగుతూ పరిశీలిస్తుంటుంది. ర్యాగింగ్ జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. క్యాంపస్‌లో 250 మంది తెలుగు విద్యార్థులే క్యాంపస్‌లో తెలుగు విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆ యా బ్రాంచ్‌లు.. సబ్జెక్టులకనుగుణంగా షెడ్యూల్ ను బట్టి క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంట ల నుంచి 2 గంటల వరకు లంచ్ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 9 వరకు డిన్నర్. భోజనంలో రెండు కూరలు, రైస్, చపాతీ వడ్డిస్తారు. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు అల్పాహారం ఇస్తారు. వారంలో రెండు రోజులు సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉంటాయి.హాస్టల్‌కు వార్డెన్‌గా ప్రొఫెసర్ ఉంటారు. అప్పుడప్పుడు హాస్టల్, క్యాంటీన్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకుంటారు. ఫుడ్ నాణ్యతను పరిశీలిస్తారు. వార్డెన్‌ను అడిగి సబ్జెక్టు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వార్డెన్ కాకుండా ఒక కేర్‌టేకర్ కూడా ఉంటారు. సీనియర్ల సహకారం ఎంతో తరగతిలో బోధన బాగుంటుంది. ఫ్యాకల్టీ బాగా చెబుతారు. స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతారు. ఇతర విద్యా సంస్థల ప్రొఫెసర్లు కూడా వచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటారు. ఎంత గ్రేడింగ్ ఇవ్వాలి? ఎన్ని మార్కులు కేటాయించాలి? ఎలా బోధించాలి? వంటి అంశాలన్నీ ప్రొఫెసర్ల చేతిలోనే ఉంటాయి. బోధనలో భాగంగా అవసరమైతే ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ), పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, వీడియో వంటివాటిని కూడా ప్రొఫెసర్లు వినియోగిస్తారు. ఫ్యాకల్టీపైన, చదివే కోర్సుపైన విద్యార్థులు ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. యూజర్ ఐడీతో వెబ్సైట్లో లాగినై కోర్సు ఎలా ఉంది? ప్రొఫెసర్లు పాఠాలు ఎలా బోధిస్తున్నారు వంటి అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలు తెలియజేయొచ్చు. సీనియర్ స్టూడెంట్స్ అకడమిక్‌గా ఎదురయ్యే సందేహాలు, ఫ్యూచర్ కెరీర్ ప్లాన్స్, జాబ్ ఇంటర్వ్యూలను ఎదుర్కోవడం వంటి వాటిపై సహాయసహకారాలు అందిస్తారు. ప్రతి సెమిస్టర్లో 7 కంటే ఎక్కువ సీజీపీఏ రావాలి నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్‌కు అన్నీ కలుపుకుని దాదాపు రూ.75,000 వరకు ఖర్చు అవుతుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5 లక్షలు లోపు ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తారు. ఇందులో భాగంగా ట్యూషన్ ఫీజులో ఎక్కువ భాగం మినహాయింపు ఉంటుంది. స్కాలర్షిప్ పొందాలంటే ప్రతి సెమిస్టర్లో 7 కంటే ఎక్కువ సీజీపీఏ పొందాల్సి ఉంటుంది. 7 కంటే తక్కువ సీజీపీఏ ఉంటే స్కాలర్షిప్ అందించరు. ఎయిమ్స్‌లో ఉచిత వైద్యం క్యాంపస్‌లో ఆడుకోవడానికి క్రీడా మైదానాలెన్నో ఉన్నాయి. ఇంకా అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఆడిటోరియం, లైబ్రరీ, ల్యాబ్‌లు; బ్యాంకు లు, ఏటీఎంలు కొలువుదీరాయి. విద్యార్థులు అస్వస్థతకు గురైతే 24 గంటలు సేవలందించే ఆస్పత్రి క్యాంపస్‌లో ఉంది. చిన్నపాటి వ్యాధులకు ఢిల్లీలోని ప్రఖ్యాత వైద్య సంస్థ ఎయిమ్స్‌లో ఉచిత వైద్యం అందిస్తారు. క్యాంపస్.. కలర్‌ఫుల్ క్యాంపస్‌లో ప్రతి ఏటా వివిధ ఫెస్ట్‌లు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది మార్చిలో టెక్నికల్ ఫెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా నాలుగు రోజులపాటు టెక్నాలజీ సంబంధిత అంశాలపై పోటీలు, గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. దేశవిదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధన సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఈ ఫెస్ట్‌కు హాజరవుతారు. ఏటా అక్టోబర్‌లో కల్చరల్ ఫెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇవేకాకుండా ఐఐటీల వరకు ప్రత్యేకంగా ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. క్యాంపస్‌లో దీపావళి, హోళి వంటి పండుగలను బాగా చేస్తాం. శని, ఆదివారాలు క్లాసులుండవు. అప్పుడప్పుడు ఢిల్లీ, ఆగ్రా పరిసర ప్రాంతాలను సందర్శించి మానసిక ఉల్లాసం పొందుతాం. కంపెనీలు ఫండింగ్ చేస్తాయి క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ కూడా ఉంది. కొత్త స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునేవారికి వివిధ కంపెనీలతో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా వివిధ కంపెనీల హెడ్లు క్యాంపస్‌కు వస్తారు. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే కంపెనీలు ఫండింగ్ సదుపాయం కల్పిస్తాయి. సెల్ ఆధ్వర్యంలో గెడైన్స్, ఇతర సూచనలు, సలహాలు అందిస్తారు. క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫేస్బుక్ వంటి కంపెనీలు ప్రతిభా వంతులకు ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి. సివిల్స్ రాస్తా బీటెక్ పూర్తయ్యాక ఒకటి లేదా రెండేళ్లు ఉద్యోగం చేస్తాను. ఆ తర్వాత సివిల్స్ రాయాలనుకుంటున్నా. -
ఆనంద్-కార్ల్సన్ మ్యాచ్‌కు స్పాన్సర్లు కరువు
ట్రోమ్సో (నార్వే): విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సన్ మధ్య నవంబర్‌లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు స్పాన్సర్లు కరువయ్యారు. ఈ నేపథ్యంలో తాను అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది నిర్వహిస్తానని రష్యా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ తెలిపారు. ఈ సోమవారం నార్వేలో జరిగే ‘ఫిడే’ ఎన్నికల్లో గ్యారీకి పోటీగా కిర్సాన్ ఇల్యుమ్‌జినోవ్ బరిలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆనంద్, కార్ల్సన్ మ్యాచ్ రష్యాలోని సోచి నగరంలో జరుగుతుంది. గతేడాది చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో విజేతకు రూ.14 కోట్లు లభించగా ఈసారి అది రూ.8 కోట్లకు తగ్గింది. ‘మూడు నెలల సమయమే ఉన్నా ఈ రీమ్యాచ్ కోసం స్పాన్సర్లు ఎవరూ లే రు. మరింత ప్రచారం చేయాల్సి ఉంది. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే వచ్చే మార్చిలో నిర్వహిస్తా. ఎందుకంటే స్పాన్సరర్లకు తగిన సమయం కావాల్సి ఉంటుంది’ అని కాస్పరోవ్ అన్నారు. -
టీమిండియాకు స్పాన్సర్ల కరువు
ముంబై: వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ టీమ్ ఇండియా, టెస్టుల్లో నంబర్ టూ, ట్వంటీ-20ల్లో నంబర్ టూ.. వీటికి తోడు క్రికెట్ ప్రపంచంలోఅత్యంత ధనిక బోర్డు బీసీసీఐ. అయినా కూడా టీమిండియాకే స్పాన్సర్లు కరువయ్యారు. అవును, ఇది నిజం. వచ్చే జనవరి నుండి 2017 మార్చి 31 వరకు 19 టెస్టులు, 25 వన్డేలు, 5 టి- ట్వంటీ మ్యాచ్‌లు టీమిండియా ఆడుతుందని హామీ ఇస్తూ, ప్లేయర్ల బ్లూ జెర్సీలపై లోగోలను బీసీసీఐ స్పాన్సర్లకు ఆఫర్ చేస్తోంది. అంతకముందు మూడేళ్లుగా భారత ఆటగాళ్లకు సహారా చెల్లించింది మాత్రం రూ. 448-548 కోట్లు మధ్య. ఇప్పటి వరకు అఫీషియల్ స్పాన్సర్ సహారా ప్రతి టీమిండియా మ్యాచ్‌కు 3.34 కోట్ల రూపాయలను ఇచ్చింది. నిజానికి 2010లో నిర్దారించిన బేస్ ప్రైజ్ 2.5 కోట్లు మాత్రమే, దానికి తోడు సచిన్ లాంటి స్టార్లు ఆడకున్నా సరే పూర్తి మొత్తాన్ని వసూలు చేశారని సహారా ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాత్రం బేస్ ప్రైజ్‌ను 1.5 కోట్లకు తగ్గించినా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో క్రికెట్ పెద్దలకు మింగుడు పడని అంశంగా మారింది.