ఆనంద్-కార్ల్‌సన్ మ్యాచ్‌కు స్పాన్సర్లు కరువు | No sponsors for Anand-Carlsen re-match: Kasparov | Sakshi
Sakshi News home page

ఆనంద్-కార్ల్‌సన్ మ్యాచ్‌కు స్పాన్సర్లు కరువు

Published Sat, Aug 9 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

ఆనంద్-కార్ల్‌సన్ మ్యాచ్‌కు స్పాన్సర్లు కరువు

ఆనంద్-కార్ల్‌సన్ మ్యాచ్‌కు స్పాన్సర్లు కరువు

ట్రోమ్‌సో (నార్వే): విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్‌సన్ మధ్య నవంబర్‌లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు స్పాన్సర్లు కరువయ్యారు. ఈ నేపథ్యంలో తాను అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది నిర్వహిస్తానని రష్యా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ తెలిపారు.
 
ఈ సోమవారం నార్వేలో జరిగే ‘ఫిడే’ ఎన్నికల్లో గ్యారీకి పోటీగా కిర్సాన్ ఇల్యుమ్‌జినోవ్ బరిలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆనంద్, కార్ల్‌సన్ మ్యాచ్ రష్యాలోని సోచి నగరంలో జరుగుతుంది. గతేడాది చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో విజేతకు రూ.14 కోట్లు లభించగా ఈసారి అది రూ.8 కోట్లకు తగ్గింది. ‘మూడు నెలల సమయమే ఉన్నా ఈ రీమ్యాచ్ కోసం స్పాన్సర్లు ఎవరూ లే రు. మరింత ప్రచారం చేయాల్సి ఉంది. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే వచ్చే మార్చిలో నిర్వహిస్తా. ఎందుకంటే స్పాన్సరర్లకు తగిన సమయం కావాల్సి ఉంటుంది’ అని కాస్పరోవ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement