
నేడు జిల్లాకు విజయమ్మ రాక
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర వెళుతున్న ఆమె మధ్యాహ్నం ఒంటిగంటకు జెట్ ఎయిర్‌వేస్ విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మధిరకు వెళతారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం ఆదివారం ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు.