రేపు సంగారెడ్డిలో జాబ్‌మేళా
Published Thu, Sep 19 2013 11:07 PM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
కలెక్టరేట్, న్యూస్‌లైన్: పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేసేందుకు ఆసక్తిగల అభ్యర్థుల కోసం ఈ నెల 21న సంగారెడ్డిలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీప్రియ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహించే జాబ్‌మేళాలో జేకే పెన్నార్ ఇండియా లిమిటెట్, వెల్‌జాన్ డెన్షన్, జీటీఎన్ ఇండస్ట్రీస్, రేన్‌బ్రేక్ లైనింగ్ లిమిటెడ్, ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమలలో అభ్యర్థుల భర్తీ కోసం జాబ్‌మేల నిర్వహిస్తున్నామన్నారు.
జేకే పెన్నార్‌లో ఐటీఐ, ఆల్ ట్రేడ్‌లకు సంబంధించి 30 ఖాళీలు, ఎస్‌ఎస్‌సీ, డిగ్రీపై 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వెల్జాన్ డెన్షన్‌లో ఐటీఐ ఫిట్టర్ 15, మెషినిస్ట్ 10, టర్నర్ 10, గ్రాండర్ 3, ఎలక్ట్రీషియన్ 3, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 5, జీటీఎన్ ఇండ స్ట్రీస్‌లో ఏడో తరగతి నుంచి 10వ తరగతి అర్హత కలిగిన మహిళా అభ్యర్థులకు మిషన్ ఆపరేటర్లుగా 50 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. రేన్‌బ్రేక్ లైనింగ్ లిమిటెడ్ ప్రజ్ఞాపూర్ కోసం ఐటీఐ, మోటర్ మెకానికల్, డీజిల్ మెకానికల్‌కు సంబంధించి 10 ఖాళీలు, ఎంఆర్‌ఎఫ్ సదాశివపేటలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ ఫెయిల్ అయిన 150 మంది అభ్యర్థుల కోసం జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు అర్హత సర్టిఫికెట్లతో సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించే జాబ్‌మేళాకు సకాలంలో హాజరుకావాలని సూచించారు.
డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో..
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇందిరాక్రాంతి పథకం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. 19 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులన్నారు. వినూత్న ఫెర్టిలైజర్‌లో ఇంటర్మీడియట్ అర్హత కలిగి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా జిల్లాలో పనిచేసేందుకు 80 మంది అభ్యర్థులను భర్తీ చేసేం దుకు మేళా నిర్వహిస్తునామన్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో నర్స్ పోస్టుల కోసం జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన వారికి 100 ఖాళీల్లో భర్తీ చేయనున్నామన్నారు. ఆసక్తిగల వారు ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా తెలిపారు. వివరాలకు 08455 272234, 9652288882 కు సంప్రదించాలన్నారు.
Advertisement