నెల్లూరు: కృష్ణపట్నం నుంచి మాచర్లకు జాతీయ రహదారిపై బొగ్గులోడుతో వెళ్తున్న లారీ మనుబోలు మండలంలోని కొమ్మలపుడి- వెంకటాచలం గ్రామాల మధ్యలో ఉన్న వంతెన గోడను ఢీ కొట్టింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో గోడ కూలీ కింద ఉన్న రైల్వే పట్టాలపై పడింది. ఈ క్రమంలోనే రైల్వే విద్యుత్ లైన్లు కూడా తెగిపోయాయి. దీంతో యశ్వంత్‌పూర్, కేరళ వెళ్లే సూపర్‌పాస్ట్ రైళ్లతో పాటు పలు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు. దీంతో ఒక వైపు రైళ్ల రాకపోకలకు లైన్ క్లియరైంది. రెండో వైపు లైన్‌లో పనులు కొనసాగుతున్నాయి. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.