కాకినాడ లీగల్: జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిలు బదిలీ కాగా, మరి కొంతమంది జూనియర్ సివిల్ జడ్జిలకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఆర్‌వీఎన్.సుందర్‌ను విశాఖపట్నం న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జి ఎన్. నాగరాజును నియమించారు. కాకినాడ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి. చక్రపాణిని రేపల్లె సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు.
ఆయన స్థానంలో గుంటూరు జిల్లాలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న కె.శ్రీదేవి పదోన్నతిపై నియమితులయ్యూరు. రాజమండ్రిలో న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎస్. శ్రీలక్ష్మి చీరాల సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యూరు. ఆమె స్థానంలో నెల్లూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.రజని నియమితులయ్యూరు. రాజమండ్రిలో ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి బి.గాయత్రిని విజయవాడ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో నెల్లూరు న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎమ్. రామకృష్ణను నియమించారు.అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.మంగాకుమారిని పదోన్నతిపై నంద్యాల రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు.
పిఠాపురం సీనియర్ సివిల్ జడ్జి ఆర్.వి.వి.ఎస్.మురళీకృష్ణను చిత్తూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఒంగోలు అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి.అమ్మన్నరాజు నియమితులయ్యూరు. రాజోలు సీనియర్ సివిల్ జడ్జి పి.రాజేంద్రప్రసాద్ శ్రీకాకుళం అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో శ్రీకాకుళం అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎ.కరుణ్‌కుమార్ నియమితులయ్యూరు. కొత్తపేట సీనియర్ సివిల్ జడ్జి టి.వెంకటేశ్వర్లు విశాఖపట్నం ఆరో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా లో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న వి.బి. ఎస్.శ్రీనివాసరావు నియమితులయ్యూరు.
జూనియర్ సివిల్ జడ్జిలకు బదిలీ
కాకినాడ నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న డి. రామలింగారెడ్డి ఒంగోలు ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో అనపర్తి జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న బి.ఎచ్.వి.లక్ష్మీకుమారిని నియమించారు. అనపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఇచ్ఛాపురం జూనియర్ సివిల్ జడ్జి బి.నిర్మలని నియమించారు.
కాకినాడ ఐదో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్. సన్యాసినాయుడు తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో భీమవరం రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి మందా వెంకటేశ్వరరావు నియమితులయ్యూరు. కాకినాడ మొబైల్ కోర్టు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కె. ప్రకాశ్‌బాబు విశాఖపట్నం ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో సోంపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాగిరెడ్డి శ్రీనివాస్‌ను నియమించారు.
కాకినాడ ఎక్సైజ్ కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కె.మురళీమోహన్‌ను భీమునిపట్నం అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యూరు. రాజమండ్రి ఏడో అదనపు జూనియర్ సివిల్ జడి ఎం. గురునాధ్ నెల్లూరు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో శ్రీకాళహస్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాసరావును నియమించారు. అడ్డతీగల జూనియర్ సివిల్ జడ్జి వి. గోపాలకృష్ణను నర్సీపట్నం అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. ఆ స్థానంలో ఎవర్నీ నియమించలేదు.
ఆలమూరు అదనపు జూనియర్ సివిల్ జడి ్జ ఇ. ఆంజనేయులు బనగానపల్లె జూనియర్ సివిల్ కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో విజయనగరం జిల్లా ఎక్సైజ్ కోర్టు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.సుబ్బారావును నియమించారు. అమలాపురం అదనపు జూనియర్ సివిల్‌జడ్జి ఎం. వెంకటేశ్వరరావు గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యూరు. అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు గురజాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న కె.రత్నకుమార్‌ను నియమించారు.
రామచంద్రపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.పద్మ నూజివీడు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. తుని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం. శ్రీహరి విశాఖపట్నం రెండో రైల్వే మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో తుని అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర్. శాంతిశ్రీ నియమితులయ్యూరు. ఆమె స్థానంలో ఆదోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న ఎం.ప్రమిక్‌రాణి నియమితులయ్యూరు.
సీనియర్ సివిల్ జడ్జిలకు బదిలీ
Published Wed, May 20 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement
Advertisement