హైదరాబాద్‌పై షరతులు పెడితే పరిణామాలు తీవ్రం | trs warns of war if curbs placed on Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌పై షరతులు పెడితే పరిణామాలు తీవ్రం

Published Mon, Nov 11 2013 5:46 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

హైదరాబాద్‌పై షరతులు పెడితే పరిణామాలు తీవ్రం - Sakshi

హైదరాబాద్‌పై షరతులు పెడితే పరిణామాలు తీవ్రం

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ మరోసారి మండిపడింది. టీ.కాంగ్రెస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ఏర్పాటుపై సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరిపై మండిపడ్డారు.తమ త్యాగాల వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యపడిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ ఏమైనా షరతులు విధిస్తే తీవ్రపరిణామాలుంటాయన్నారు.

 

ఒకవేళ ఏమైనా కిరికిరి చేస్తే 1969 కంటే మించిన ఉద్యమాన్ని చేపడతామని నాయిని హెచ్చరించారు. హైదరాబాద్‌పై సీమాంధ్రుల పెత్తనం ఉంటే తెలంగాణ ఏర్పడినా ప్రయోజనం ఉండదని, ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రంతోనే ఈ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడతాయని టీఆర్‌ఎస్ విమర్శించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement