T.Congress leaders
-
'పేద ప్రజలకు మేం వ్యతిరేకం కాదు'
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకాల పేరిట కాంగ్రెస్ నాయకులు రూ.కోట్లు దోచుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పేరిట సొంత లాభం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రస్తుత టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద పట్టుబడ్డ డబ్బులు కూడా ఇందిరమ్మ ఇళ్లవేనంటూ ఆయన ఆరోపించారు. పేద ప్రజలకు తాము వ్యతిరేకం కాదని.. పేదల పక్షాన నిలబడే ప్రభుత్వమని రామలింగారెడ్డి అన్నారు. -
'పోలవరంపై రాజ్యసభలో ఓటింగ్‌కు పట్టుబడతాం'
లోక్‌సభలో పోలవరం ఆర్డినెన్స్ బిల్లు అప్రజాస్వామికంగా ఆమోదించారని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేవలం అధికార బలంతో తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తూ ఆర్డినెన్స్‌కు చట్టబద్దత కల్పించారని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో కేటీఆర్ లోక్‌సభలో పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించిన తీరుపై నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లా ప్రజలపై నిజంగా ప్రేమే ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి... రాజ్యసభలో ఆ బిల్లును వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ కోసం పట్టుబడతామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు తెలంగాణ ప్రజల వైపు ఉండాలనుకుంటున్నారో లేక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తొత్తులుగా ఉండదలచుకున్నారో తేల్చుకోవాలని కేటీఆర్ పచ్చ తమ్ముళ్లకు సవాల్ విసిరారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని... ఆ క్రమంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ, టీడీపీ నేతలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని... ఆ ప్రాజెక్టు డిజైన్ మాత్రమే మార్చాలని మాత్రమే తాము కోరుతున్నామని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌పై నీ పెత్తనం ఏంటని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఓ అతిథిగాలాగానే ఉండాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. -
టీ కాంగ్రెస్ పోటీ దీక్ష
తెలంగాణ మంత్రులు, నేతల భేటీలో నిర్ణయం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం సీఎం కిరణ్ సహా సీమాంధ్ర మంత్రులు, నేతలు ఢిల్లీలోని ఇందిర సమాధి శక్తిస్థల్ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమవుతుండగా.. అదే సమయంలో నెహ్రూ సమాధి శాంతివనం వద్ద దీక్ష చేసేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సమాయత్తమయ్యూరు. డిప్యూటీ సీఎం దామోదర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆర్టికల్ 3 ప్రకారం విభజన ప్రక్రియ పూర్తి చేయూలని డిమాండ్ చేయనున్నారు. సోమవారం ఢిల్లీకి చేరుకున్న నేతలు సమావేశమై ముఖ్యమంత్రికి పోటీగా దీక్ష చేసే విషయమై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, ప్రసాద్‌కుమార్, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డిలు ఈ మేరకు ప్రతిపాదించగా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందుకు ఆమోదం తెలిపారు. ఇదే విషయమై కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌లతో సైతం మంత్రులు విడివిడిగా చర్చించారు. ముఖ్యమంత్రికి దీటైన సమాధానం చెప్పాలంటే దీక్షే సరైన విధానమని అభిప్రాయపడిన జైపాల్‌రెడ్డి సహా ఇతర కేంద్ర మంత్రులు దీక్షకు తాము సైతం హాజరవుతామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. -
టీ.కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర ప్రజల్నిరెచ్చగొడుతున్నారు:హరీష్
మెదక్ జిల్లా: తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర నేతల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. అసలు రచ్చబండ కార్యక్రమం ఉద్దేశం ఏలా ఉన్నా, కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర నేతల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని హితవు పలికారు. వీరంతా కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండా తన నివేదికను ఎలా పంపుతారని ఆయన ప్రశ్నించారు. అలా నివేదికను పంపడం రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆయనకు తెలియదా?అని నిలదీశారు. నిన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డ హరీష్ రావు ఈ రోజు టీ.కాంగ్రెస్ నేతలను దయ్యబట్టారు. చంద్రబాబు తనకు తాను సిద్ధాంతాలను ఏర్పరుచుకుంటూ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర విభజనపై ఎటువంటి వైఖరి చెప్పని బాబు ఈ రోజు ఏదో కొబ్బరికాయ సిద్ధాంతం మాట్లాడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌పై షరతులు పెడితే పరిణామాలు తీవ్రం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ మరోసారి మండిపడింది. టీ.కాంగ్రెస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ఏర్పాటుపై సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరిపై మండిపడ్డారు.తమ త్యాగాల వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యపడిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ ఏమైనా షరతులు విధిస్తే తీవ్రపరిణామాలుంటాయన్నారు. ఒకవేళ ఏమైనా కిరికిరి చేస్తే 1969 కంటే మించిన ఉద్యమాన్ని చేపడతామని నాయిని హెచ్చరించారు. హైదరాబాద్‌పై సీమాంధ్రుల పెత్తనం ఉంటే తెలంగాణ ఏర్పడినా ప్రయోజనం ఉండదని, ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రంతోనే ఈ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడతాయని టీఆర్ఎస్ విమర్శించింది. -
22న టీ కాంగ్రెస్ నేతల ‘చలో ఢిల్లీ’
-
22న టీ కాంగ్రెస్ నేతల ‘చలో ఢిల్లీ’
సాక్షి, హైదరాబాద్: టీ కాంగ్రెస్ నేతల్లో ‘తెలంగాణ’ గుబులు మొదలైంది. ‘విభజన’ ప్రక్రియ మొదలైందంటూనే.. కేంద్రం అడుగు కూడా ముందుకు వేయకపోవడంపై వారిలో ఆందోళన చెలరేగుతోంది. విభజన ఆగిపోయిందంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ప్రచారం.. ‘తెలంగాణ’ ప్రకటించి నెలన్నర దాటిపోతున్నా ఏర్పాటు అంశం కదలకపోవడం వారికి మింగుడు పడడం లేదు. దీంతోపాటు ‘విభజన’పై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్లుగా జరుగుతున్న ప్రచారంతో టీ కాంగ్రెస్ నేతలకు ఊపిరి ఆడడం లేదు. దీంతో ‘తెలంగాణ’పై తేల్చుకోవడానికి మరోసారి హస్తిన యాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 22న మంత్రులు సహా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దాదాపు ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తొమ్మిది మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్సీలతో పాటు డీసీసీల అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్, పీసీసీ ఆఫీస్ బేరర్లు సహా సుమారు 90 మంది నేతలు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ సమావేశానికి హాజరు కాలేదు. రేణుక రాకపై రగడ: ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ నేతల సమావేశానికి ఎంపీ రేణుకాచౌదరి రావడం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రేణుకాచౌదరి రాకపట్ల సమావేశం ఆరంభంలోనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేపదే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆమెను సమావేశానికి ఎందుకు పిలిచారని నిర్వాహకులను నిలదీశారు. ‘కనీసం ఆత్మ గౌరవం లేకుంటే ఎలా? పిలిస్తే మాత్రం ఎందుకు వచ్చినట్లు? తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారు? సిగ్గూ, జ్ఞానం ఉన్నవారెవరూ రారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా సమావేశానికి రావడం అవివేకం’ అని మండిపడ్డారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఒక దశలో వారిద్దరూ సమావేశం నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవ్వగా జానారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి సర్దిచెప్పారు. ఇంత జరుగుతున్నా రేణుకా చౌదరి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారని సమాచారం. కాగా, సమావేశం జరుగుతుండగానే ఉస్మానియా జేఏసీ విద్యార్థులు అక్కడికి వచ్చారు. వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని నినాదాలు చేశారు. ఢిల్లీ వెళితే వాస్తవాలు: కేంద్రం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటన చేసి 45 రోజులైనా.. ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం పట్ల సమావేశంలో నేతలంతా ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాత్రం తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం వెనక్కి వెళ్లే ప్రసక్తే ఉండదని, ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, హైదరాబాద్ విషయంలోనే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డీఎస్ పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పరిధిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్తరిస్తూ పోతోందని.. దాని వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరముందని నేతలంతా అభిప్రాయపడటంతో.. ఈ నెల 22న ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలవాలని తీర్మానించారు. తేలని ‘సభ’: సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనే అంశంపై సమావేశంలో ఏకాభిప్రాయం రాలేదు. ఇప్పుడే బహిరంగ సభలు వద్దని కొందరు, తొలుత నియోజకవర్గ స్థాయి నుంచి సభలు నిర్వహిస్తే బాగుంటుందని మరికొందరు చెప్పారు. సికింద్రాబాద్ కాకుండా నిజామాబాద్‌లో తొలి సభ పెడదామని సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ ప్రస్తావించగా.. అప్పుడే తొందరపడొద్దని డీఎస్ వారించారు. దీంతో ఢిల్లీ పర్యటన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుందామని అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి విస్తృతంగా కార్యక్రమాలు: తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసినప్పటికీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు సరైన ప్రయోజనం కలగడం లేదని సమావేశంలో నేతలంతా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 17వ తేదీ నుంచి విస్తృత కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. 17 నుంచి 24 వరకు ‘ఊరూరా కాంగ్రెస్ జెండా-సోనియాకు అండ’ పేరుతో ఇంటింటికీ వెళ్లి ప్రచా రం చేయాలని తీర్మానించారు. 20న జిల్లాల్లో డీసీసీ సమావేశాలను ఏర్పాటు చేసి సోనియాగాంధీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. సీఎం వ్యవహారంపై ఆగ్రహం.. తెలంగాణకు వ్యతిరేకంగా సీఎం, సీమాంధ్ర మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీలు వీహెచ్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పొన్నం తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం తెలంగాణపై ప్రకటన చేసిన తరువాత కూడా సీఎం వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మౌనంగా ఎందుకు ఉండాలని ప్రశ్నిం చారు. సీమాంధ్రలో ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రజలకు అందాల్సిన రేషన్‌కార్డులు, ఇతర ప్రయోజనాలను సీఎం కావాలనే దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. మరికొందరు నేతలు కూడా సీఎం వైఖరిని తప్పుబట్టడంతో.. సీఎంపై అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి వచ్చారు. సమావేశం తీర్మానాలు.. తెలంగాణ ఇవ్వాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత కూడా.. దానికి వ్యతిరేకంగా పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కేంద్రం నిర్ణయాన్ని గందరగోళ పరిచేలా వ్యవహరిస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని 17న తెలంగాణలో గ్రామగ్రామానా కాంగ్రెస్ జెండాలను ఎగరేయాలి. విమోచన దినోత్సవాలను జయప్రదం చేయాలి. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు తెలంగాణకు హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. హైదరాబాద్‌లో నివసించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు, ప్రజలకు రక్షణ, వారి వ్యాపారాలకు భద్రత వంటి అంశాలు రాజ్యాంగం, చట్టాలకు లోబడే ఉంటాయి. విద్యార్థులు, యువత, ప్రజలు తెలంగాణ ఏర్పాటుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆవేశంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దు. ప్రత్యేక రాష్ట్రం కోసం మరణించిన వారికి ఈ సమావేశం నివాళులు అర్పిస్తోంది. తెలంగాణ రాష్ర్టం తొందరగా ఏర్పాటు కావాలని ప్రయత్నిస్తున్న వారందరికీ సంఘీభావం వ్యక్తం చేస్తున్నాం. -
'హైదరాబాద్' అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు
దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అంశాన్ని టీ.కాంగ్రెస్ నేతలు, మంత్రలు వివాదం చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి మంగళవారం హైదరాబాద్‌లో ఆరోపించారు. టి.కాంగ్రెస్ నేతలవి తెలివితక్కువ వ్యాఖ్యలని ఆయన కొట్టిపారేశారు. హైదరాబాద్ నగరంపై వారంతా ఇష్టారాజ్యాంగా వ్యవహారిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి నేతల చేతిలో తెలంగాణ రాష్ట్రం పెడితే నష్టం తప్పదని శ్రీహరి ఈ సందర్భంగా హెచ్చరించారు. విద్యా, సామాజీక అంశాలపై అవగాహన లేని కొందరు తెలంగాణ ప్రాంతాన్ని నష్ట పరిచేలా మాట్లాడుతున్నారని శ్రీహరి తెలిపారు. -
'హైదరాబాద్' అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు
దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అంశాన్ని టీ.కాంగ్రెస్ నేతలు, మంత్రలు వివాదం చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి మంగళవారం హైదరాబాద్‌లో ఆరోపించారు. టి.కాంగ్రెస్ నేతలవి తెలివితక్కువ వ్యాఖ్యలని ఆయన కొట్టిపారేశారు. హైదరాబాద్ నగరంపై వారంతా ఇష్టారాజ్యాంగా వ్యవహారిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి నేతల చేతిలో తెలంగాణ రాష్ట్రం పెడితే నష్టం తప్పదని శ్రీహరి ఈ సందర్భంగా హెచ్చరించారు. విద్యా, సామాజీక అంశాలపై అవగాహన లేని కొందరు తెలంగాణ ప్రాంతాన్ని నష్ట పరిచేలా మాట్లాడుతున్నారని శ్రీహరి తెలిపారు.