'హైదరాబాద్' అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు | T.Congress leaders making Hyderabad a controversial issue says kadiyam srihari | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్' అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు

Published Tue, Aug 20 2013 1:15 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

T.Congress leaders making Hyderabad a  controversial issue says kadiyam srihari

దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అంశాన్ని టీ.కాంగ్రెస్ నేతలు, మంత్రలు వివాదం చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి మంగళవారం హైదరాబాద్లో ఆరోపించారు. టి.కాంగ్రెస్ నేతలవి తెలివితక్కువ వ్యాఖ్యలని ఆయన కొట్టిపారేశారు. హైదరాబాద్ నగరంపై వారంతా ఇష్టారాజ్యాంగా వ్యవహారిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి నేతల చేతిలో తెలంగాణ రాష్ట్రం పెడితే నష్టం తప్పదని శ్రీహరి ఈ సందర్భంగా హెచ్చరించారు. విద్యా, సామాజీక అంశాలపై అవగాహన లేని కొందరు  తెలంగాణ ప్రాంతాన్ని నష్ట పరిచేలా మాట్లాడుతున్నారని శ్రీహరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement