మెదక్ జిల్లా: తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర నేతల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. అసలు రచ్చబండ కార్యక్రమం ఉద్దేశం ఏలా ఉన్నా, కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర నేతల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని హితవు పలికారు. వీరంతా కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండా తన నివేదికను ఎలా పంపుతారని ఆయన ప్రశ్నించారు. అలా నివేదికను పంపడం రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆయనకు తెలియదా?అని నిలదీశారు.
నిన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డ హరీష్ రావు ఈ రోజు టీ.కాంగ్రెస్ నేతలను దయ్యబట్టారు. చంద్రబాబు తనకు తాను సిద్ధాంతాలను ఏర్పరుచుకుంటూ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర విభజనపై ఎటువంటి వైఖరి చెప్పని బాబు ఈ రోజు ఏదో కొబ్బరికాయ సిద్ధాంతం మాట్లాడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.