టీటీడీ ఉద్యోగులకు వయోపరిమితి 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లు పెంచడంపై ఆ సంస్థ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు వయో పరిమితిని తమకు వర్తింపచేయడంపై నిరసన తెలుపుతున్నారు. టీటీడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని... అలాంటి సంస్థలోని ఉద్యోగులకు ప్రభుత్వ ఆదేశాలు వర్తింపచేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల వయస్సు పెంపు అంశాన్ని టీటీడీ పాలక మండలి సమావేశంలో ఆమోదించాలని ఉద్యోగులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.