కూర్మనాథాలయంలో తాబేళ్ల పార్కు
గార : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో పార్కులో ఉండాల్సిన తాబేళ్లు సమీపంలో పూలమొక్కల్లో నూ దర్శనమిస్తున్నాయి. తాబేళ్ల అక్రమ రవా ణాపై వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటిని సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. తాబేలుని ఈశాన్యం భాగంలో ఉంచుకోవడం ద్వారా శని ప్ర వేశాన్ని అడ్డుకోవచ్చన్న ఓ మూఢ నమ్మకం తాబేలుని ఉంచాలన్న కోరికను భక్తుల్లో కలిగేలా చేస్తోంది. వాస్తవానికి వన్య ప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం దేశంలో నక్షత్ర తాబేళ్లు అంతరించిపోతున్న అరుదైన జాతి.
దీన్ని బంధించడం గానీ, పెంచడం గానీ చేయకూడదు. అందుకే శ్రీకూర్మంలో పార్క్ ఏర్పాటు చేశారు. అయితే సంరక్షణ వి షయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. సంరక్షణతో పాటు ఆహారం పూర్తిస్థాయిలో అందడం లేదన్న మీడియా కథనాలను ఇటీవలే వచ్చిన ఈఓ గురునాధరావు సీరియస్‌గా తీసుకున్నారు. భక్తులు డబ్బుల రూపంలో సాయం చేయాలని, ఆహారం మాత్రం తీసుకురావద్దని ఆదేశాలిచ్చి అమలయ్యేలా చూశారు.
తాబేలు మరణిస్తే ప్రత్యే క పద్ధతిలో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చే యాలని వన్యప్రాణ సంరక్షణ చట్టం చెబుతుంది. గత నెలలో సమీప శ్వేతపుష్కరిణి ఒడ్డున చెత్తతో పాటు చనిపోయిన తాబేలు కూడా ఉంది. దీనిపై ఆలయ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అయితే పార్కులో ఎన్ని తాబేళ్లు ఉన్నాయి, ఇటీవల ఎన్ని జన్మించాయన్న సమాచారం దేవాలయ అధికారుల వద్ద లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాబేళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment