ఫిలిప్పీన్స్‌ నుంచి విద్యార్థుల మృతదేహాలను రప్పించండి | Two Andhra students dead bodies to be return from Philippines says YS Jagan | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌ నుంచి విద్యార్థుల మృతదేహాలను రప్పించండి

Published Fri, Apr 17 2020 8:40 AM | Last Updated on Fri, Apr 17 2020 8:42 AM

Two Andhra students dead bodies to be return from Philippines says YS Jagan - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను ఏపీకి రప్పించేందుకు అవసరమైన చర్యలు త్వరగా తీసుకోవాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో ఖర్చుకు వెనకాడవద్దని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని, ప్రక్రియను వేగవంతం చేశామని అధికారులు వివరించారు. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు కేపీ వంశీ, రేవంత్‌ కుమార్‌ మృతదేహాలను రాష్ట్రానికి రప్పించడంపై విదేశాంగశాఖ మంత్రికి ఇప్పటికే సీఎం లేఖ రాసిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement