ఇద్దరు మోసగాళ్ల అరెస్ట్
రియల్ ఎస్టేట్.. సాఫ్ట్‌వేర్ అంటూ కోట్లాది రూపాయల్ని దండుకున్న ఘరానా మోసగాడిని ఏలూరు పోలీసులు అరెస్ట్ చేయగా.. కువైట్ పంపిస్తానంటూ 29 మందికి కుచ్చుటోపీ పెట్టిన మరో మోసగాడిని తణుకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు పోలీసులు అరెస్ట్ చేసిన మోసగాడి నేరాల చిట్టా చాంతాడంత ఉంది. అతనిపై 15 పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదయ్యూరుు. మూడో తరగతి చదివిన అతడు జనాన్ని దోచుకోవడంలో మాత్రం మోసగాళ్లకే మోసగాడు అన్నంత స్థారుుకి ఎదిగాడు. వివరాల్లోకి వెళితే...
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : రాష్ట్రవ్యాప్తంగా మోసాలకు పాల్పడి కోట్లాది రూపాయల్ని కొల్లగొట్టిన ఘరానా మోసగాడిని ఏలూరు త్రీ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ పి.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. యలమంచిలి మండలం గుంపర్రు శివారు కడిమిపుంట గ్రామానికి చెందిన తుంగా నాగేశ్వరరావు అనే వ్యక్తి రొ య్యల మేత, రియల్ ఎస్టేట్, సాఫ్ట్‌వేర్ వ్యాపారాల పేరిట అనేక మందిని మోసగించి కోట్లాది రూపాయల్ని దండుకున్నాడు. 3వ తరగతి మాత్రమే చదివిన నాగేశ్వరరావు తండ్రి త్రిమూర్తులుతో కలిసి చేపలు, రొయ్యల మేతల వ్యాపారం చేసేవాడు. అందులో నష్టాలు రావడంతో డీలర్లకు ఎగనామం పెట్టి తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి వెళ్లిపోయూడు. అక్కడ కొంతకాలం ఉండి నెల్లూరు జిల్లా యాదాయపాలెం ప్రాంతానికి మకాం మార్చాడు.
అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు అతణ్ణి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. బెయిల్‌పై విడుదలైన నాగేశ్వరరావు హైదరాబాద్‌కు మకాం మార్చి అక్కడా రియల్ ఎస్టేట్ పే రుతో ప్రజలకు రూ.1.30 కోట్లకు టోకరా వేశాడు. హైదరాబాద్ పోలీసులు అతణ్ణి అరెస్ట్ చేయగా, బెరుుల్‌పై బయటకొచ్చి అనంతపురంలో రియల్ ఎస్టేట్ పేరుతో అక్కడి వారినుంచి రూ.1.20 కోట్లను వసూలు చేసి మోసగించాడు. అక్కడా అరెస్టైన నాగేశ్వరరావు పాలకొల్లులో క్రియ ఇండస్ట్రీస్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించినట్టు నమ్మించి ఉద్యోగాల పేరిట యువకుల నుంచి భారీ మొత్తాలను వసూలు చేశాడు. మోసపోరుున యువకులు పాలకొల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతడు మకాం ఉన్న ప్రతి ప్రాంతంలో వేర్వేరు మహిళలతో సహజీవనం చేసేవాడు. నాగేశ్వరరావు 2006 నుంచి మరుసగా మోసాలకు పాల్పడుతూనే ఉన్నాడు. ఇతనిపై రాష్ట్రవ్యాప్తంగా 15 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యూరుు.
పట్టుబడిందిలా..
ఏలూరు శాంతినగర్ 7వ రోడ్డులో నివాసం ఉంటున్న తా డికొండ శ్రీనివాసరావు జాతకాలు చెబుతుంటారు. ఇతని వద్దకు జాతకం చూపించుకోవడానికి నాగేశ్వరావు వస్తుం డేవాడు. శ్రీనివాసరావు స్థితిగతులను గమనించిన నాగేశ్వరావు ఆయనపైనా తన విద్యను ప్రదర్శించాడు. ధర్మాజీ గూడెంలో 64 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకే ఇప్పిస్తానని నమ్మించాడు. దఫదఫాలుగా జ్యోతిష్యుడు శ్రీనివాసరావు నుంచి రూ.90 లక్షలను చెక్కుల రూపంలో తీసుకున్నాడు. ఆ మొత్తం చాలదని చెప్పిన నాగేశ్వరరావు శ్రీనివసరావు నివాసముంటున్న ఇంటిని రూ.1.25 కోట్లకు తన పేరిట రిజిస్ట్రేషన్ చేరుుంచుకున్నాడు.
నెలలు గడిచినా 64 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ విషయూన్ని తేల్చకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరావు ధర్మాజీగూడెంలోని భూ యజమానికి ఫోన్‌చేసి డబ్బు ఇచ్చినా ఎందుకు రిజి స్ట్రేషన్ చేయడం లేదని అడిగారు. తనకెవరూ డబ్బులివ్వలేదని భూయజమాని చెప్పడంతో మోసపోరుున విషయూన్ని గ్రహించిన శ్రీనివాసరావు ఏలూరు త్రీ టౌన్ పోలీ స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు యలమంచిలి మండలం గుంపర్రు శివారు కడిమిపుంటలో రూ.2 కోట్లతో అధునాతన భవనం నిర్మించే పనిలో నిమగ్నమైన నాగేశ్వరరావును వలపన్ని పట్టుకున్నారు. అతణ్ణి కోర్టులో హాజరపర్చనున్నట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.